పెళ్లికి భారీగా హాజరైన అతిథులు.. సీన్ లోకి పోలీసుల ఎంట్రీ.. చివరికి..?!

దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది.రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవ్వడంతో పాటు భారీ సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి.

 Police Gave Variety Punishment To Guests Who Attended Marriage , Marriage ,relat-TeluguStop.com

దీంతో పలు రాష్ట్రాలు లాక్ డౌన్ లు లేదా కర్ఫ్యూలు విధించాయి.అన్నింటిపై ఆంక్షలు విధించాయి.

వేడుకలకు, పెళ్లిళ్లకు అనుమతి తప్పనిసరి చేస్తూ.పరిమిత సంఖ్యలోనే హాజరు కావాలనే నిబంధనలు విధించాయి.

ఈ నేపథ్యంలో పలువురు అధికారుల నుండి అనుమతి తీసుకుని వేడుకలు జరుపుకుంటున్నారు.అయితే కొంతమంది మాత్రం నిబంధనలు పాటించకుండా.

గుట్టు చప్పుడు కాకుండా పెళ్లిళ్లు జరిపిస్తున్నారు.తాజాగా మధ్యప్రదేశ్ లో కరోనా నిబంధనలు పాటించకుండా ఓ వివాహ వేడుక నిర్వహించగా.ఆ వేడుకకు భారీ సంఖ్యలో అతిథులు హాజరయ్యారు.పోలీసులకు సమాచారం ఎలా వెళ్లిందో కానీ వారు రంగంలోకి దిగారు.

ఆ వివాహ వేడుకకు సుమారు 200 మందికి పైగా అతిథులు హాజరవ్వగా.పోలీసులు అక్కడికి వెళ్లే సరికి అందరూ పరారయ్యారు.

కొందరు దురదృష్టవంతులు మాత్రం పోలీసులకు చిక్కారు.పోలీసులు వారికి వింత పనిష్మెంట్ ఇచ్చారు.

నడిరోడ్డుపై కప్పల్లా గెంతాలని ఆదేశించారు.దీంతో చేసేదేం లేక వారంతా రోడ్డు వెంట కప్పల్లాగా గెంతుకుంటూ వెళ్లారు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అంతటా చక్కర్లు కొడుతోంది.

ఈ వీడియోపై నెటిజెన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.అలాంటి శిక్ష వేసిన పోలీసులను కొంతమంది తప్పుపడుతున్నారు.

మరికొంతమంది దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఇలా నిర్లక్ష్యంగా కరోనా నిబంధనలను ఉల్లఘించి భారీ సంఖ్యలో పెళ్ళికి హాజరవ్వడం కరెక్ట్ కాదని.అలాంటి వారికి ఇలాంటి శిక్షే విధించాలంటున్నారు.

కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో కేసులు, మరణాలు పెరుగుతున్నా.మంచి ముహుర్తాలు ఉండటంతో పెళ్లిళ్లు, ఇతర వేడుకలు కూడా ఎక్కువగానే జరుగుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube