కుక్కకు రిటైర్మెంట్.. ఎక్కడో తెలుసా?

విద్య, వ్యాపార, వాణిజ్య, ఉద్యోగ ఇలా మరిన్ని రంగాలలో పనిచేసే వ్యక్తులకు రిటైర్ మెంట్ అనేది ఉంటుంది.ప్రతి ఒక్కరికి తమ జీవితంలో ఏదో ఒక చోట విరామం ఉండాలి.

 Police Gave Retirement To Dog In Maharashtra-TeluguStop.com

ఇలా కేవలం ఒక్క రంగంలోనే కాకుండా అన్ని రంగాల్లో కూడా పనిచేసే వ్యక్తులకు రిటైర్ మెంట్ అనేది ఉంటుంది.అందుకే రిటైర్ మెంట్ సమయంలో ఉండే వ్యక్తులను రిటైర్ మెంట్ పేరుతో ఘనంగా వీడ్కోలు చేస్తారు.

ఇలా కేవలం రిటైర్ మెంట్ అనేది మనుషులకు మాత్రమే ఉంటుందని తెలుసు.కానీ ఓ రంగంలో తమకు రక్షణగా ఉండే జంతువులకు కూడా రిటైర్ మెంట్ చేస్తారట.

 Police Gave Retirement To Dog In Maharashtra-కుక్కకు రిటైర్మెంట్.. ఎక్కడో తెలుసా-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంతే కాకుండా వాటికి ఘనంగా వేడుకలు జరిపించి మరి వీడుకోలు అందిస్తారట.ఇలాంటి ఘటనే ఓ చోట జరగగా ప్రస్తుతం ఆ జంతువు వీడియో వైరల్ గా మారింది.

మహారాష్ట్రలోని నాసిక్ లోని పోలీస్ రంగంలో తమ సేవలకు రక్షణగా ఉండే పోలీస్ జాగిలానికి ఘనంగా వీడ్కోలు పలికారు.మహారాష్ట్ర పోలీస్ బాంబ్ డిటెక్షన్ స్వాడ్ లోపదకొండేళ్ల పాటు ఆ జాగిలం తన బాధ్యతలను ఎంతో సక్రమంగా నిర్వహించింది.

దీంతో ఇప్పటికీ దాన్ని సర్వీస్ పూర్తి కాగా ఇటీవలే ఆ జాగిలం సేవలకు రిటైర్ మెంట్ ఇచ్చారు పోలీసు అధికారులు.దీంతో ఆ జాగిలం కు ఎంతో ఘనంగా వీడ్కోలు జరిపించాలని పోలీసులు నిర్ణయించుకోగా వాహనం పై కూర్చోబెట్టి పువ్వులతో అలంకరించి జాగిలం కు పూల మాల వేసి ఘనంగా తిప్పించారు.

దీంతో అక్కడున్న పోలీసులు, అధికారులు కరతాళ ధ్వనులతో ఆ జాగిలం కు వీడుకోలు చేశారు.ప్రస్తుతం ఈ వీడియో ను తీయగా సోషల్ మీడియాలో పంచుకున్నారు.

ఇది చూసిన నెటిజనులు ఆ జాగిలం పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

#Retirement #Police #Maharastara

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు