పెళ్లికి వచ్చిన అతిథులకు ఝలక్.. వచ్చిన ఒక్కొక్కరికి రూ.1000 ఫైన్..!

దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుండటంతో పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ లు, కర్ఫ్యూలను అమలు చేస్తున్నారు.కరోనా కట్టడికై కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నారు.

 Police Fined One Thousand Rupees Each Who Came To Marriage In Corona Crisis In S-TeluguStop.com

తెలుగు రాష్ట్రాల్లో కూడా లాక్ డౌన్, కర్ఫ్యూలు అమలులో ఉన్న విషయం తెలిసిందే.అయితే ఆంక్షల్లో భాగంగా ఏదైనా వేడుకలకు, శుభకార్యాలకు, కార్యక్రమాలకు హాజరయ్యే వారి సంఖ్య విషయంలో ప్రభుత్వం కొన్ని నిబంధనలు విధించింది.

కొన్ని చోట్ల పెళ్లి చేసుకోవాలంటే అనుమతి తీసుకోవడం తప్పనిసరిగా ఉండాలని నిబంధనలు పెట్టారు.ఇలాంటి సమయంలో పలువురు నిబంధనలు ఉల్లంఘించి పోలీసులకు చిక్కుతున్నారు.

కాగా ఇటీవల ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో ఓ టీచర్ వివాహ వేడుకకు 250 మంది హాజరు అయ్యారు.దీంతో పోలీసులు ఆ వరుడికి రూ.2 లక్షల జరిమానా విధించిన విషయం తెలిసిందే.ఇక తాజాగా అదే జిల్లాలో మరో సంఘటన చోటుచేసుకుంది.నిబంధనలు ఉల్లఘించి పెళ్ళికి ఎక్కువ సంఖ్యలో హాజరైనందుకు ఆ వధూవరులతో పాటు అతిథులందరికి మనిషికి రూ.1000 చొప్పున పోలీసులు జరిమానా విధించారు.

Telugu Corona, Fine, Masks, Thousand Rupees, Srikakulam, Talada, Latest-Latest N

ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.

వివరాల్లోకి వెళితే.శ్రీకాకుళం జిల్లా భామిని మండలం తాలాడ గ్రామంలో ఓ పెళ్లి వేడుక జరిగింది.ఆ వివాహ వేడుకకు అతిథులు భారీగా తరలి వచ్చారు.కనీసం మాస్కులు కూడా ధరించకుండా గుంపుగా తిరుగుతూ వేడుకలో సందడి చేశారు.దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

రెవెన్యూ అధికారులతో పాటు పోలీసులు రంగంలోకి దిగారు.ఆ వేడుకకు పరిమితికి మించి అతిథులు రావడంతో అధికారులు అక్కడున్న వారందరినీ మందలించారు.

Telugu Corona, Fine, Masks, Thousand Rupees, Srikakulam, Talada, Latest-Latest N

నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ.వధూవరులతో సహా మిగతా వారందరికీ ఒక్కొక్కరికి రూ.1000 చొప్పున జరిమానా విధించారు.దీంతో ఆ పెళ్లికి వచ్చిన వారంతా షాకయ్యారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే పెళ్లి వారి కుటుంబానికి ఫైన్ వేయాలి గానీ పెళ్లికి వచ్చిన వారికి కూడా జరిమానా వేస్తారా అంటూ పోలీసులు, రెవెన్యూ అధికారులతో కొందరు గ్రామస్థులు వాగ్యాదానికి దిగారు.నిబంధనలు అతిక్రమిస్తే ఎవరైనా ఫైన్ కట్టాల్సిందేనని.

దాదాపు 30 మందితో పోలీసులు రూ.వెయ్యి చొప్పున జరిమానా కట్టించుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube