ఇదేందయ్యా ఇది: కారులో వెళ్తే హెల్మెట్ లేదంటూ పోలీసుల ఫైన్..!

రోజురోజుకీ ట్రాఫిక్ పెరుగుతున్న నేపథ్యంలో రోడ్డుమీద ప్రయాణాలు చేసేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించకుంటే చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ట్రాఫిక్ నిబంధనలు పాటించక పోవడం వల్ల చాలామంది రోడ్డు ప్రమాదాలకు గురవుతూ మృత్యువాత పడుతూ ఉన్న సంఘటనలు ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాం.

 Police Fine For Not Having A Helmet In The Car ..! Car, Fine, Helmet,not Wear, L-TeluguStop.com

ఈ ప్రమాదాలు నివారించడానికి నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు పోలీసులు ఫైన్ వేయడం అందరికీ తెలిసిందే.అయితే సాధారణంగా ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ లేదని ఫైన్ వేయడం, వాహనానికి సంబంధించిన పత్రాలు అన్ని లేకున్నా, రాష్ డ్రైవింగ్ చేసినా, త్రిబుల్ రైడింగ్ చేసినా ఫైన్ వేయడం మనం చూస్తూనే ఉన్నాము.

అయితే ట్రాఫిక్ పోలీసులు కూడా ఈ మధ్య ఎన్ని చర్యలు తీసుకుంటున్నా రోడ్డు ప్రమాదాలు జరగడం ఆగడంలేదు.దీంతో నగరంలో పని చేస్తున్న హోమ్ గార్డ్ నుంచి సిఐ వరకు అందరికీ ట్రాఫిక్ ఉల్లంఘించిన వారి ఫోటోలు తీసి, ఈ చలాన్ నమోదు చేసేందుకు ఉన్నతాధికారుల అనుమతి ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే.

అయితే పోలీసుల నిర్లక్ష్యం బాధ్యతారాహిత్యం కారణంగా కొందరు పొరపాటు చేయని వాహనచోదకులు కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.కారు నడిపే వారికి కూడా హెల్మెట్లు ఉండాలని.

, బైక్ నడిపే వారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని, వీధిలో వాహనం పార్కింగ్ చేశారంటూ పలు విధాలుగా ట్రాఫిక్ పోలీసులు ఈ చలానాలు జారీ చేయడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Telugu Fine, Helmet, Latest, Wear-Latest News - Telugu

తాజాగా విశాఖపట్నంలో ఎంవిపి కాలనీ సర్కిల్ వద్ద తాజాగా ఏపీ 31 ఎక్స్ 441 నంబర్ గల కారు నీ హెల్మెట్ లేకుండా నడుపుతున్నారని పేర్కొంటూ ట్రాఫిక్ పోలీసులు కార్డు ఫోటోతో సహా ఈ చలానా జారీ చేశారు అలాగే ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తికి గల 39 ఎఫ్ఏ 3768 నంబరు కారు కి త్రిబుల్ రైడింగ్ వితౌట్ హెల్మెట్ పేరుతో రూ.635 జరిమానా విధిస్తూ ఈ చలాన్ జారీ చేయడంతో అవాక్కయ్యారు.అలాగే ఒక వ్యక్తి పెద్ద వాల్తేరులో ఇంటి ముందు కారు పార్కింగ్ చేస్తే నో పార్కింగ్ పేరుతో ఈ చలాన్ జారీ చేశారు.

ఇలా తాము ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడినట్లు జరిమానా విధిస్తూ ఈ చలాన్ వివరాలు సెల్ఫోన్లు వస్తుండడంతో వాహనదారులు ఉలిక్కిపడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube