న్యాయం కోసం వచ్చిన తల్లితో అక్రమ సంబంధం... అలాగే కూతురితో కూడా...  

Police Department Series On Sub Inspector In Hyderabad - Telugu Hyderabad Crime News, Hyderabad Latest News, Hyderabad Local News, Hyderabad News, Sub Inspector Crime News, Sub Inspector News, Telangana News

సాధారణంగా మామూలు వ్యక్తులు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తారు.అయితే న్యాయం కోసం వచ్చిన వారిని కాపాడి వారికి రక్షణ కల్పించాల్సింది పోయి న్యాయం కోసం వచ్చిన వారితోనే అక్రమ సంబంధం పెట్టుకొని చిత్ర హింసలకు గురి చేస్తే ఇక వారికి దిక్కెవరు మరియు వారు ఎవరితో చెప్పుకోవాలి.

Police Department Series On Sub Inspector In Hyderabad

తాజాగా ఓ మహిళ ఓ ఉదంతం గురించి ఫిర్యాదు చేసేందుకుగాను పోలీసులను సంప్రదించగా ఓ ఎస్సై ఏకంగా ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాకుండా ఆ మహిళ కూతురుతో కూడా అక్రమ సంబంధం పెట్టుకున్న ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే  స్థానికంగా ఉన్నటువంటి ఓ మహిళ కేసు నిమిత్తమై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది.

దీంతో ఆ మహిళపై కన్నేసినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ ఆమెను ఎలాగైనా లొంగదీసుకోవాలని పన్నాగం పన్నాడు.ఈ క్రమంలో ఆమెతో మాటలు కలుపుతూ కచ్చితంగా న్యాయం చేస్తానని తన ఫోన్ నెంబర్ తీసుకుని విచారణ నిమిత్తమై మాట్లాడుతూ ఉండేవాడు.

ఈ వ్యవహారం కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది.దీంతో మహిళతో ఎస్సై చనువుగా ఉంటూ తరుచూ ఇంటికి వస్తూ వెళ్తూ ఉండేవాడు.దీంతో అతని నమ్మినటువంటి మహిళ దాదాపుగా ఐదు లక్షల రూపాయల వరకు డబ్బులు కూడా ముట్ట చెప్పినట్లు తెలుస్తోంది.అయితే ఈ క్రమంలో ఆ మహిళ కూతురుతో కూడా ఎస్సై అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.

దీంతో ఇద్దరికీ ఒకరికి తెలియకుండా ఒకరుతో మాట్లాడుతూ ఇద్దరిని బుట్టలో వేసుకొని లొంగదీసుకున్నాడు.అయితే తన తల్లిపై అనుమానం వచ్చినటువంటి మహిళ కూతురు నిఘా ఉంచి ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది.

దీంతో ఈ వ్యవహారంపై దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకు ఫిర్యాదు చేసింది.అయితే నిందితుడు అప్పటికే తన పలుకుబడిని ఉపయోగించి కేసు నమోదు కాకుండా ఆపడంతో బాధితురాలు పోలీసు ఉన్నతాధికారులను సంప్రదించింది.అంతేగాకుండా అందుకు సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా వారికి చూపించి ఫిర్యాదు నమోదు చేసింది.దీంతో పోలీసు ఉన్నతాధికారులు ఎస్సై పై విచారణ నిమిత్తమై పోలీస్ స్టేషన్ కి రావాలంటూ నోటీసులు పంపించారు.

అయితే ఆ ఎస్సై మాత్రం పోలీసు అధికారులు నోటీసులు బేఖాతరు చేసినట్లు తెలుస్తోంది.

తాజా వార్తలు

Police Department Series On Sub Inspector In Hyderabad-hyderabad Latest News,hyderabad Local News,hyderabad News,sub Inspector Crime News,sub Inspector News,telangana News Related....