యువ‌కుడి పై పోలీసుల దౌర్జన్యం.. మాస్కు ధ‌రించ‌లేద‌ని.. ?

ప్రజలు కరోనా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిని చితకబాదటమే పరిష్కార మార్గంగా కొందరు పోలీసులు వ్యవహరిస్తున్నారు.ఇలాంటి ఘటనలు ఈ మధ్యకాలంలో తరచుగా జరుగుతున్న విషయం తెలిసిందే.

 Police Crushed The Young Man For Not Wearing A Mask-TeluguStop.com

ఇకపోతే దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రతను గమనిస్తున్న జనం కూడా కోవిడ్ పట్ల పట్టీ పట్టనట్లుగా వ్యవహరించడం బాధాకరం.తమకు తెలియకుండానే ఇతరులకు నష్టాన్ని కలిగిస్తున్నారు.

ఇకపోతే ఇలంటి ఘటనే ఒడిశా లో చోటు చేసుకుంది.ఆ వివరాలు తెలుసుకుంటే.

 Police Crushed The Young Man For Not Wearing A Mask-యువ‌కుడి పై పోలీసుల దౌర్జన్యం.. మాస్కు ధ‌రించ‌లేద‌ని.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఒడిశా రాష్ట్రం భద్రక్ జిల్లాలోని ఓ దేవాలయానికి శుభరంజన్ అనే యువకుడు తన కుటుంబ సభ్యుల తో కలిసి వెళ్లాడట.కోవిడ్ నేపధ్యంలో మాస్క్ తప్పని సరి అని మరచిన ఆ యువకుడు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు శుభ‌రంజ‌న్ చితకబాదారు.

అయితే తన కుమారుడి పట్ల దారుణంగా వ్యవహరించిన పోలీసుల పట్ల తగు చర్యలు తీసుకోవాలని అతడి తండ్రి భద్రక్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు.కాగా ఈ దృశ్యాల‌ను అక్క‌డున్న ఓ వ్య‌క్తి త‌న మొబైల్‌లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పొస్ట్ చేయగా ఈ వీడియో వైరల్‌గా మారిందట.

#Police Crushed #Subharanjan #Wearing Mask #Bhadrak Temple #Odisha

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు