హుజూరాబాద్‌లో మొద‌లైన కానిస్టేబుళ్ల బ‌దిలీలు.. ఈట‌ల‌కు చెక్ పెట్టేందుకేనా?

ఈట‌ల రాజేంద‌ర్ కు ఎలాగైనా చెక్ పెట్టాల‌ని కేసీఆర్ ప‌క్కాగా ముందుకు వెళ్తున్నారు.ఆయ‌న‌ను మంత్రి వ‌ర్గం నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేసిన‌ప్ప‌టి నుంచి సైలెంట్‌గానే త‌న ప‌నికానిచ్చేస్తున్నారు గులాబీ బాస్, ఇప్ప‌టికే ఈట‌లకు పార్టీలో ఎవ‌రూ మ‌ద్ద‌తుగా చూసుకున్న కేసీఆర్‌.

 Police Constables Transfers Started In Huzurabad Is It To Put Check For Etela-TeluguStop.com

నియోజ‌క‌వ‌ర్గంలో కూడా ఈట‌ల‌ను ఒంటరి చేసేందుకు ప్లాన్ వేస్తున్నారు.ఇక త్వ‌ర‌లోనే వ‌చ్చే ఉప ఎన్నిక‌లో ఈట‌ల‌కు బ‌లం లేకుండా చూసేందుకు.

హుజూరాబాద్ లో ఈట‌ల‌కు మ‌ద్ద‌తుగా ఉంటున్న వారిపై ఫోక‌స్ పెట్టారు.

 Police Constables Transfers Started In Huzurabad Is It To Put Check For Etela-హుజూరాబాద్‌లో మొద‌లైన కానిస్టేబుళ్ల బ‌దిలీలు.. ఈట‌ల‌కు చెక్ పెట్టేందుకేనా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

గ‌త రెండు ద‌శాబ్దాలుగా హుజూరాబాద్‌లో ఈట‌ల రాజేంద‌రే చ‌క్రం తిప్పుతున్నారు.

ఆయ‌న త‌ప్ప ఇంకెవ్వ‌రూ అక్క‌డ గెల‌వ‌ట్లేదు.అయితే అప్ప‌టి నుంచే వివిధ ప్ర‌భుత్వ విభాగాల్లో ఈట‌ల‌కు మ‌ద్ద‌తు దారులుగా ఉంటున్న వారిని ఇప్ప‌టికే ప్ర‌భుత్వం బ‌దిలీ చేయించింది.

డీసీపీలు, ఎమ్మార్వోల‌ను ఇప్ప‌టికే ఇత‌ర జిల్లాల‌కు ట్రాన్స్‌ఫ‌ర్ చేయించింది ప్ర‌భుత్వం
.

ఇక తాజాగా హుజూరాబాద్ అర్బ‌న్‌, రూర‌ల్‌, జమ్మికుంట అర్బ‌న్‌, రూర‌ల్ తో పాటు మొత్తం ఐదు మండ‌లాల్లో ఉన్న కానిస్టేబుళ్ల‌పై బ‌దిలీ వేటు వేసేందుకు ప్లాన్ చేస్తున్నారు కేసీఆర్‌.

వారంతా ఈట‌ల‌కు మ‌ద్ద‌తు దారుల‌ని గుర్తించి ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.

Telugu @cm_kcr, 300 Constables Transfers, Check For Etela, Eetala Rajendhar, Etela Vs Kcr, Huzurabad Constituency, Kcr Master Plan, Police Constables, Telangana Politics, Transfers Started In Huzurabad-Telugu Political News

దాదాపు 300కిపైగా కానిస్టేబుళ్ల‌పై వేటు ప‌డునుంది.అయితే దీన్ని క‌ప్పిపుచ్చుకునేందుకు క‌రీంన‌గ‌ర్ క‌మిష‌న‌రేట్ వ్యాప్తంగా బ‌దిలీలు నిర్వ‌హించ‌నున్న‌ట్టు తెలుస్తోంది.అప్పుడే ఎవ‌రికీ అనుమానం రాకుండా ఉంటుంద‌ని భావిస్తున్నారు గులాబీ బాస్‌.

ఇప్పుడున్న వారంతా ఈట‌ల‌కు మ‌ద్ద‌తుగా ఉంటున్న‌ట్టు తెలుస్తోంది.వారిని ప‌క్క‌న‌పెట్టి త‌మ పార్టీకి అనుకూలంగా ఉండేవారిని రంగంలోకి దింపేందుకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు.

ఇదే జ‌రిగితే ఈట‌ల‌కు క‌ష్ట‌మే అని చెప్పాలి.ఇప్ప‌టికే నియోజ‌క‌వ‌ర్గంలో త‌న మ‌నుషుల‌ను ఇబ్బంది పెడుతున్నార‌ని ఈట‌ల ఆరోపిస్తున్నారు.

ఇక బ‌దిలీలు గ‌న‌క జ‌రిగితే ఈట‌ల ప్ర‌తి విష‌యంలో ఇబ్బందులు ప‌డాల్సిందే.ఉప ఎన్నిక వ‌చ్చేలోపే ఈ తంతు జ‌రుగుతుంద‌ని తెలుస్తోంది.

#Kcr Master Plan #Check For Etela #300Constables #@CM_KCR #Etela Vs Kcr

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు