తమ్ముడి హత్యలో హీరోయిన్ ప్రధాన ముద్దాయి... నిర్ధారించిన పోలీసులు

ఈ మధ్య కాలంలో సమాజంలో మానవత్వం రోజురోజుకి నశించిపోతుందని కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటేనే తెలుస్తుంది.సొంత చెల్లెలు మీద అన్నలు అత్యాచారం.

 Police Confirmed Heroine Shanaya Katwe  Main Accused In Brother Murder, Sandalwo-TeluguStop.com

సొంత అన్నదమ్ముల వైరంతో చంపుకునే వరకు వెళ్ళడం, తల్లిదండ్రులని కనికరం లేకుండా ఆస్తుల కోసం, వ్యసనాలకి బానిసైన పిల్లలు హత్యలు చేయడం చూస్తూ ఉన్నాం.అయితే ఇలాంటి ఘోరాలు అన్ని కూడా లో ప్రొఫైల్ మనుషులే చేస్తారని అనుకుంటే కచ్చితంగా పొరపాటే అవుతుంది.

హత్యలు చేయడం ఒక ఎత్తయితే మరీ కిరాతకంగా నరికేసి, పోలీసులకి చిక్కకుండా తగలబెట్టేసే సైకో లక్షణాలు మనుషులలో బయట పడుతున్నాయి.హై ప్రొఫైల్ కుటుంబాలలో కూడా ఇలాంటి ఘోరాలు బయట పడుతున్నాయి.

కొద్ది రోజుల క్రితం కన్నడంలో హీరోయిన్ గా రాణిస్తున్న షనాయా కత్వె ప్రేమ వ్యవహారంలో అడ్డుగా ఉన్నాడని సొంత తమ్ముడుని హత్య చేసిందనే ఆరోపణలతో పోలీసులు అరెస్ట్ చేశారు.

అయితే ఈ హత్యలో ముందుగా ఆమె ప్రియుడుతో పాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు.

తరువాత ఆమెని అదుపులోకి తీసుకున్నారు.అయితే తన తమ్ముడికి, తనకి మధ్య విభేదాలు ఉన్న మాట వాస్తవమే అయినా అతనిని తాను హత్యచేయలేదని తెలిపింది.

అయితే పోలీసులు ఆమెని అదుపులోకి తీసుకొని తమ శైలిలో విచారించి అసలు వాస్తవాలు బయట పెట్టారు.తమ్ముడు హత్యలో ఆమెనే కీలక పాత్రధారి అని పేర్కొన్నారు.

రియలెస్టేట్ వ్యాపారి నియాజ్ తో షనాయా ప్రేమాయణం సాగిస్తోంది.పేయింగ్ గెస్ట్ లా ఆయన ఇంట్లోనే ఉంటోంది.

అది నచ్చని ఆమె తమ్ముడు వ్యతిరేకించాడు.దీంతో, తన ప్రేమకు అడ్డుగా ఉండడంతో అతని మట్టుబెట్టేందుకు ప్లాన్ వేసింది.

నియాజ్ ఇంట్లోనే అతనికి ఊపిరాడకుండా చేసి షనయా హతమార్చింది.అనంతరం శవాన్ని ముక్కలుగా నరికి, తగలబెట్టి, ప్లాస్టిక్ సంచిలో ప్యాక్ చేసి అటవీ ప్రాంతంలో పడేశారు.

కనికరం లేకుండా ప్రేమ వ్యామోహంలో తోడబుట్టిన తమ్ముడిని పైశాచికంగా చంపేసిన ఆ హీరోయిన్ ని ఉరితీసిన పరవాలేదని కన్నడ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube