నగర ప్రజలకు పోలీస్ కమిషనర్ సజ్జనార్ కీలక సూచనలు.. !

నగరంలో కరోనా కేసుల విజృంభన ఇంకా కొనసాగుతున్న నేపధ్యంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రజలకు కీలక సూచనలు చేశారు.దేశంలో సెకండ్ వేవ్ తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది.

 Police Commissioner Sajjanar Gives Key  Nstructions Police Commissioner, Sajjana-TeluguStop.com

కాబట్టి కరోనా కట్టడిలో భాగంగా ప్రభుత్వం లాక్ డౌన్ విధించిందని, అందరు లాక్‌డౌన్ సమయం లో ఈ నిబంధనలను బాధ్యతగా పాటించాలని సూచించారు.

ఎవరూ అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని, విధిగా రెండు మాస్కులు తప్పక ధరించాలని, వెంట శానిటైజర్ తప్పక ఉంచుకోవాలని, ఏమైనా కోవిడ్ లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని పేర్కొన్నారు.

ఇకపోతే కరోనా కట్టడిలో భాగంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 5 వేల మంది పోలీసులు విధుల్లో పాల్గొంటున్నారని చెప్పారు.కాగా ఈ రోజు కమిషనరేట్ పరిధిలోని సుచిత్ర, గోల్నాక క్రాస్ రోడ్స్, ఆల్విన్ కాలనీ, దూలపల్లి క్రాస్ రోడ్స్ ప్రాంతాల్లో పర్యటించి పై విధంగా వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube