ప్రియాంక రెడ్డి పేరు మార్చేసిన పోలీసులు  

Police Commisioner Sajjanar Changes Priyanka Reddy Name To Disha-

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డి హత్యాచార ఘటనపై ప్రజల్లో ఆగ్రహం తీవ్రంగా కనిపిస్తోంది.ఆ సంఘటనలో తప్పెవరిది అనే విషయం పక్కన పెడితే ఆడపిల్లలకు రక్షణ లేదు అనే విషయం మరోసారి తేటతెల్లం అయ్యింది.ప్రియాంకారెడ్డి మీద అత్యాచారం చేసి పాశవికంగా ఆమెను తగులబెట్టిన నిందితులను ఉరి తీయడమే లేక ఎన్ కౌంటర్ చేయడమో చేయాలనే డిమాండ్ ప్రజల నుంచి పెరుగుతోంది.ఈ సంఘటనపై రాజకీయ నాయకులందరూ స్పందించి నిందితులకు శిక్ష పడేలా చేస్తామంటూ హామీ ఇచ్చారు.

Police Commisioner Sajjanar Changes Priyanka Reddy Name To Disha- Telugu Viral News Police Commisioner Sajjanar Changes Priyanka Reddy Name To Disha--Police Commisioner Sajjanar Changes Priyanka Reddy Name To Disha-

నిందితుల తల్లి తండ్రులు కూడా ఈ విషయంలో కఠిన నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరడం వైరల్ అయ్యింది.ఇక ప్రియాంక రెడ్డి కేసు విషయంలో సీపీ సజ్జనార్ కీలక నిర్ణయం తీసుకున్నారు.దేశవ్యాప్తంగా జస్టిస్ ఫర్ ప్రియాంకారెడ్డి అంటూ ఆందోళనలు పెరిగిపోతున్న నేపథ్యంలో నిర్భయ, అభయ పేర్లలాగా ప్రియాంకారెడ్డికి పేరును దిషాగా మార్చారు.ఇకపై ప్రియాంకారెడ్డిని ‘జస్టిస్ ఫర్ దిషా’గా పిలవాలని సీపీ సజ్జనార్ సూచించారు.