కామాంధుడైన రైల్వే సూపర్వైజర్ కు దేహశుద్ధి

తనకు సుఖం ఇస్తేనే డ్యూటీ ఇస్తానని, మహిళా కార్మికుల్ని వేధింపులకు గురిచేస్తూ ఇబ్బంది పెడుతున్న తిరుపతి రైల్వే స్టేషన్ సూపర్వైజర్ గుణశేఖర్ కు సిఐటియు, ఐద్వా కార్యకర్తలు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.తిరుపతి రైల్వే స్టేషన్ పరిధిలో రైల్వే కోచ్ క్లీనింగ్ కార్మికులపై నిత్యం లైంగిక వేధింపులకు పాల్పడుతున్న కోచ్ సూపర్వైజర్ గుణశేఖర్ నాయుడిని ట్రాప్ చేసి పోలీసులకు అప్పజెప్పారు.

 Police Caught Red Handed  Tirupati Railway Supervisor For Harassing Women, Polic-TeluguStop.com

తన కోరికను తీర్చాలని తీర్చకపోతే డ్యూటీ ఇవ్వనని ఓ మహిళా కార్మికురాలిని వేధిస్తున్న నేపథ్యంలో సూపర్వైజర్ ను సిఐటియు, ఐద్వా, యువజన సంఘాల ఆధ్వర్యంలో ట్రాప్ చేసి పోలీసులకు పట్టివ్వడమే కాకుండా దేహశుద్ధి చేశారు… తిరుచానూరు పద్మావతీ అమ్మవారి ఆలయానికి సమీపంలోని ఓ ప్రైవేటు లాడ్జిలో దేహ శుద్ధి చేసి పోలీసులకు అప్పజెప్పారు.

గత కొన్ని రోజులుగా రైల్వే కోచ్ లో పనిచేస్తున్న మహిళలను లైంగిక వేధింపులకు గురిచేస్తూ, తనకు లొంగ కుంటే గుణశేఖర్ తీవ్రమైన ఇబ్బందులకు గురి చేసేవారని సూపర్వైజర్ తనకు లొంగిన వాళ్లను ఒకరకంగా లొంగని వాళ్ళను మరో రకంగా చూస్తూ వేధింపులకు గురి చేస్తున్నాడని రైల్వే కార్మికులు ఆరోపించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube