ఏటీఎం అలారం మోగిన.. చివరికి పోలీసులు వచ్చిన లూటీ ఆపని చోరుడు.. చివరకి..?!

Police Caught Deaf And Dumb Thief Robbing Atm In Nizamabad

దొంగతనం చేయాలంటే మాటలా చెప్పండి.ఎంతో చాకిచక్యంగా పక్కా ప్రణాళికతో, ఎవరికీ చిన్న అనుమానం రాకుండా ప్లాన్ చేసుకొవాలి.

 Police Caught Deaf And Dumb Thief Robbing Atm In Nizamabad-TeluguStop.com

ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా గాని కటకటాల పాలు అవ్వాలిసిందే.పోలీసుల చేతిలో బొక్కలు ఇరగదియించుకోవాలిసిందే.

దొంగతనం చేసేవాళ్ళు సాధారణంగా దొంగతనం చేసిన తరువాత పోలీసులకు చిక్కుతారూ.కానీ ఈ దొంగ మాత్రం కాస్త వెరైటీ అన్నమాట.

 Police Caught Deaf And Dumb Thief Robbing Atm In Nizamabad-ఏటీఎం అలారం మోగిన.. చివరికి పోలీసులు వచ్చిన లూటీ ఆపని చోరుడు.. చివరకి..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పోలీసులు వచ్చాక కూడా దొంగతనం చేసే పనిలోనే నిమగ్నం అయిపోయాడు.అతడు దొంగతనం చేస్తున్నాడన్న విషయం చుట్టుపక్కల అందరికి తెలుసు.

కానీ వారికి తెలుసన్న విషయం మాత్రం అతనికి తెలియదు.పాపం ఎంతో పెద్ద స్కెచ్ వేసి మరి ఏటీఎం లో డబ్బులు కాజేయాలని చూసాడు.

అంతా సక్రమంగా జరుగుతుంది అనే టైమ్ లోనే అతనికి అనుకోని షాక్ తగిలింది.అసలు ఈ దొంగ చేసిన తప్పు ఏంటో తెలుసుకుందామా.

దొంగతనం చేయాలంటే తెలివితేటలతో పాటు అన్ని అవయవాలు కూడా సరిగ్గా పనిచేస్తూ ఉండాలి.కానీ ఈ దొంగ మాత్రం తెలివితేటలు ఉంటే చాలు అని అనుకున్నాడు.కానీ పోలీసులు వచ్చి అతన్ని పట్టుకునే దాక అసలు ఎందుకు దొరికిపోయినా అనే విషయం అతనికి అర్ధం కాలేదు.అతను దొరకడానికి గల కారణం ఏంటంటే అతను ఒక చెవిటివాడు.

అలాగే మూగవాడు కూడా.అన్ని తెలిసి కూడా ఏటీఎంలో చోరీ చేసేందుకు వెళ్లాడు.

ఈ ఘటన నిజామాబాద్‌ నగర పాలక సంస్థలో చోటు చేసుకుంది.డిలోడ్ సునీల్ అనే వ్యక్తి నిజామాబాద్ నగరపాలక సంస్థ పారిశుద్ధ్య విభాగంలో అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగిగా పని చేస్తున్నాడు.

అయితే అతడు మాట్లాడలేడు.అలాగే వినలేడు కూడా.

కానీ సునీల్ ఎప్పటినుంచో పద్మానగర్ ఏటీఎంలో దొంగతనం చేయాలనీ ప్లాన్ లో ఉన్నాడు.

Telugu Alarm, Atm Alarm, Deaf Dumb Thief, Latest, Nizamabad, Atm, Theft, Theif, Thief Suneel-Latest News - Telugu

ప్లాన్ ప్రకారం శనివారం అర్ధరాత్రి పద్మనగర్ ఏటీఎం దగ్గరకు వెళ్లి, చుట్టు పక్కల ఎవరన్నా ఉన్నారేమో అని పరిశీలించి, ఎవరూ లేరని నిర్ధారించుకుని ఏటీఎంలోకి వెళ్ళాడు.ఆ తర్వాత అతని వెంట తెచ్చుకున్న రాడ్డుతో ఏటీఎం మిషన్ ను బద్దలు కొట్టాడు.ఇంకేముంది మెషీన్ కూయ్.

కూయ్.మంటూ కూయడం మొదలు పెట్టింది.

అలారం మోతని గమనించని సునీల్ డబ్బులు దోచుకునే పనిలో పడ్డాడు.ఎందుకంటే సునీల్ కి ఏమి వినపడదు కాబట్టి.

Telugu Alarm, Atm Alarm, Deaf Dumb Thief, Latest, Nizamabad, Atm, Theft, Theif, Thief Suneel-Latest News - Telugu

ఏటీఎం అలారం శబ్దం విన్న స్థానికులు లేచి దొంగ తనం జరుగుతుంది అని గమనించి వెంటనే పోలీసులుకు సమాచారం ఇచ్చారు.విషయం తెలుసుకున్న పోలీసులు ఎటిఎం దగ్గరకు వచ్చి చూడగా సునీల్ ఇంకా మెషీన్ లోని డబ్బులు తీసే పనిలోనే ఉన్నాడు పాపం.ఇంకేముంది పోలీసులు సునీల్ ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకుని విచారం చేపట్టారు.

#Deaf Dumb Thief #Alarm #Theft #Atm #Theif

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube