అఖండ సినిమా చూసిన ఆ గ్రామ ప్రజలు అరెస్ట్.. కారణం అదేనా?

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే ఈయన నటించిన అఖండ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్లను రాబడుతోందో అందరికీ తెలిసిందే.

 Police Case On Balakrishna Akhanda Movie Outdoor Visitors Details, Akhanda Movi-TeluguStop.com

బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సారి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.కలెక్షన్ల పరంగా రెండు రాష్ట్రాలలో దూసుకుపోతున్న అఖండ సినిమా ఏకంగా 100 సెంటర్లలో 50 రోజులు దిగ్విజయంగా థియేట్రికల్ రన్ అవ్వడమే కాకుండా ఓటీటీలో కూడా ప్రసారం అవుతూ మంచి విజయాన్ని దక్కించుకుంది.

ఇదిలా ఉండగా బాలకృష్ణ నటించిన ఈ సినిమా చూసిన ఒక గ్రామస్తులు పెద్ద ఎత్తున ఇబ్బందుల్లో పడినట్లు తెలుస్తోంది.

బాలకృష్ణ పై ఉన్న అభిమానంతో ఆంధ్ర ప్రదేశ్ లోని ఒక గ్రామంలో ప్రజలు ఆరుబయట పెద్ద స్క్రీన్ పై ఈ సినిమాని వీక్షించారు.

ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.దీంతో ఈ గ్రామ ప్రజలు మొత్తం ఇబ్బందులలో పడినట్లు అయింది.అసలు అఖండ సినిమా చూడటానికి గ్రామస్తుల పై పోలీస్ కేస్ అవడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే…

ఆంధ్రప్రదేశ్లోని ఒక గ్రామంలో గ్రామం మొత్తం అఖండ సినిమాని బిగ్ స్క్రీన్ ఏర్పాటు చేసుకుని వీక్షించారు.ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీ నేతలు ఈ వ్యవహారం పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడంతో ఈ ఘటన పై ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి.నిజానికి ఒక సినిమాని బహిరంగంగా ప్రదర్శితం చేయాలంటే సంబంధిత నిర్మాతలు పంపిణీదారుల అనుమతితో మాత్రమే ఇలా బహిరంగ ప్రదర్శన చేయాలి.

అయితే ఈ గ్రామంలోని ప్రజలు హాట్ స్టార్ యాప్ నుండి ఆఫీస్ ప్రొజెక్టర్ ద్వారా ప్రొజెక్ట్ చేసారు.అంతేకాకుండా దీనికి ఎక్స్టర్నల్ సౌండ్ సిస్టం కూడా అమర్చారు.సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం ఒక సినిమాని ఏ విధమైనటువంటి అనుమతి లేకుండా అధికారికంగా ప్రకటిస్తే అది చట్టపరంగా నేరం.

అదేవిధంగా పబ్లిక్ ఎగ్జిబిషన్ కోసం హాట్ స్టార్ కంటెంట్ ఉపయోగించడం కూడా చట్టపరంగా నేరమవుతుంది.

చట్ట ప్రకారం వెళితే ఆ గ్రామస్తులు అఖండ సినిమా విషయంలో చేసింది నేరం కనుక ఈ వ్యవహారం కాస్త ఈ గ్రామస్తులకు తలనొప్పిగా మారే అవకాశం ఉంటుంది.ఈ విషయం పై అధికారులు చర్యలు తీసుకుంటే గ్రామ ప్రజలపై కేసు నమోదు అవుతుంది.అయితే బాలకృష్ణ పై ఉన్న అభిమానంతో ఆయన అభిమానులు ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో కొన్ని వర్గాలు మాత్రం ఈ ఘటన పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడం గమనార్హం.

Police Case On Balakrishna Akhanda Movie Outdoor Visitors Details, Akhanda Movie, Out Door Visit, Police Case, Tollywood, Akhanda Movie, Andhra Pradesh, Villagers, Projector, Big Screen, Ycp Leaders, Nandamuri Balakrishna, Pragya Jaiswal, Boyapati Srinu - Telugu Akhanda, Andhra Pradesh, Big Screen, Boyapati Srinu, Door, Pragya Jaiswal, Tollywood, Villagers, Ycp

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube