రాజ్ తరుణ్ కొత్త సినిమాపై పోలీస్ కేసు.. కారణమేమిటంటే? -Telugu Tollywood Movie Actor Hero Profile & Biography  

ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మావ, కుమారి 21 ఎఫ్ సినిమాల ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో మినిమం గ్యారంటీ హీరోగా రాజ్ తరుణ్ గుర్తింపు తెచ్చుకున్నారు.అయితే కెరీర్ మొదట్లో వరుస విజయాలు సాధించిన రాజ్ తరుణ్ కుమారి 21 ఎఫ్ తర్వాత ఆ స్థాయి సక్సెస్ మాత్రం సాధించలేకపోయారు.ఈ నెల ఒకటో తేదీన ఆహా ఓటీటీలో విడుదలైన రాజ్ తరుణ్ ఒరేయ్ బుజ్జిగా డిజాస్టర్ గా నిలిచింది.
అయితే సినిమాలు ఫ్లాప్ అవుతున్నా శాటిలైట్ రైట్స్ ద్వారా నిర్మాతలకు బాగానే ఆదాయం వస్తూ ఉండటంతో రాజ్ తరుణ్ కు వరుస అవకాశాలు వస్తున్నాయి.అయితే రాజ్ తరుణ్ నటిస్తున్న కొత్త సినిమాపై తాజాగా పోలీస్ కేసు నమోదైంది.కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల గత కొన్ని నెలలుగా సినిమా షూటింగులు ఆగిపోయిన సంగతి తెలిసిందే.సీనియర్ స్టార్ హీరోలు ఇంకా షూటింగులకు దూరంగానే ఉండగా యంగ్ హీరోలు ఇప్పుడిప్పుడే షూటింగ్ లలో పాల్గొంటున్నారు.
అయితే షూటింగ్ లకు అనుమతులు ఇచ్చినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాయి.కరోనా నిబంధనల వల్ల పబ్లిక్ ప్లేసుల్లో పోలీసుల అనుమతి ఉంటే మాత్రమే షూటింగ్ లు చేసుకోవచ్చు.అయితే రాజ్ తరుణ్ కొత్త సినిమా ఉప్పల్ లోని బ్యాంకు కాలనీలోని పబ్లిక్ ప్లేస్ లో ఎటువంటి అనుమతులు లేకుండా షూటింగ్ జరుపుకుంటోంది.
కరోనా నిబంధనలను ఉల్లంఘించటంతో పోలీసులు ప్రొడక్షన్ మేనేజర్ పై కేసు నమోదు చేశారు.వనమాలి క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది.వరుస ఫ్లాపులతో సతమవుతున్న రాజ్ తరుణ్ కథ, కథనాల విషయంలొ జాగ్రత్తలు తీసుకుంటూ కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడని తెలుస్తోంది.

#Lock Down #Coronavirus #Kumari 21 F #Raj Tarun #Orey Bujjiga

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

Police Case Filed Against Hero Raj Tarun Movie Related Telugu News,Photos/Pics,Images..