ఆపండి అంటూ పెండ్లి క్యాన్సిల్ చేసిన పోలీసులు.. ఎగ‌రి గంతేసిన పెండ్లి కూతురు..!

పెండ్లి అంటే ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో ఎంతో ముఖ్య‌మైన ఘ‌ట్టం.అది లేనిదే జీవితానికే అర్థం లేద‌ని అనిపిస్తుంది.

 Police Cancel Wedding The Bride Who Dances Away-TeluguStop.com

అలాంటి పెండ్లి స‌మ‌యం వ‌స్తే ప్ర‌తి ఒక్క‌రూ ఎగిరి గంతేస్తారు.కానీ ఓ చోట మాత్రం పెండ్లి ఆగిపోయినందుకు పెండ్లి కూతురు తెగ సంబుర‌ప‌డిపోతోంది.

ఇంకో గంట అయితే మూడు ముళ్లు ప‌డుతాయ‌ని అనుకోగా అనూహ్యంగా వ‌చ్చిన పోలీసులు పెండ్లిని ఆపేశారు.దీంతో అంతా షాక్ అయ్యారు.

 Police Cancel Wedding The Bride Who Dances Away-ఆపండి అంటూ పెండ్లి క్యాన్సిల్ చేసిన పోలీసులు.. ఎగ‌రి గంతేసిన పెండ్లి కూతురు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే పెండ్లి కూతురు మాత్రం విచిత్రంగా సంబుర‌ప‌డిపోవ‌డంతో అస‌లు ఏం జ‌రుగుతుందో ఎవ‌రికీ అర్థం కాలేదు.

నిజానికి ఆ పెండ్లిని ఆపేసింది కూడా పెండ్లి కూతురే.

వివ‌రాళ్లోకి వెళ్తే.తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై పుజల్ ప్రాంతానికి చెందిన జనతుల్లా ఫిర్డోస్ అనే అమ్మాయికి కూడా పెండ్లి చేద్దామ‌నుకుని త‌న కుటుంబసభ్యులు పెళ్లిని నిశ్చయించారు.

కానీ ఆమెకు ఇష్టంలేని వ్య‌క్తితో బలవంతంగా అమ్మాయి మేనమామకు ఇచ్చి చేసేందుకు ఏర్పాట్లు కూడా చేయ‌డంతో ఆమె తీవ్ర నిరాశ‌లో కూరుకుపోయింది.ఇక అస‌లు సిస‌లైన పెండ్లి రోజు రానే వచ్చింది.

ఇక అంతా అనుకున్న‌ట్టుగానే వధువుతో పాటు వరుడు కూడా మండపానికి వ‌చ్చారు.

Telugu Arrest Bride, Cancel Wedding, Chennai, Force Marriage, Janatulla Firdous, Police, Police Stopped Wedding, Pujal Area, Tamilnadu State-Latest News - Telugu

దీంతో ఎలాగైనా పెండ్లిని ఆపేయాల‌ని పెండ్లి కూతురు నిర్ణయించుకుని తాను అనుకున్న‌దే త‌డ‌వు త‌న‌కు ఇష్టం లేద‌ని చెబుతూ ఓ వీడియోను రూపొందించి తన ఫ్రెండ్స్‌కు పంపించింది.ఇక దాన్ని పోలీసులకు ఫార్వర్డ్ చేసిన ఆమె ఫ్రెండ్ష్ అస‌లు విష‌యాన్ని వివ‌రించారు.దీంతో మ‌హిళా పోలీసులు ఎంట‌ర్ అయి పెండ్లిని ఆపేశారు.

అంతే కాదు అమ్మాయి తల్లిదండ్రులు, అలాగే వ‌రుడిపై కేసు న‌మోదు చేయ‌డంతో అంతా షాక్ తిన్నారు.మొత్తానికి పెండ్లి కూతురు అంద‌రికీ భ‌లే షాక్ ఇచ్చింది.

కానీ అమ్మాయి త‌ల్లిదండ్రులు మాత్రం ఇబ్బందుల్లో ప‌డ్డారు.

#Chennai #Pujal Area #Cancel Wedding #Force Marriage #Arrest Bride

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు