ఎన్ఆర్ఐ ఫిర్యాదుతో కదిలిన డొంక: అమ్మాయిలతో మాట్లాడించి ట్రాప్.. భార్యాభర్తల గుట్టురట్టు

వెబ్‌సైట్‌లో అందమైన అమ్మాయిల ఫోటోలతో ఓ ఎన్ఆర్ఐని నిలువునా దోపిడి చేసిన ముఠాగుట్టును పోలీసులు రట్టు చేశారు.సులభంగా డబ్బు సంపాదనకు అలవాటుపడిన ఓ దంపతుల బండారాన్ని బయటపెట్టారు.

 Police Busted Online Honey Trap Case In Vizianagaram, Aswini Kumar Raja, Sidhuja-TeluguStop.com

వివరాల్లోకి వెళితే.విజయనగరానికి చెందిన అశ్వీనీ కుమార్‌రాజా, సింధూ దంపతులు పట్టణంలోనే ఓ అపార్ట్‌మెంట్‌లో అద్దెకు నివసిస్తున్నారు.

సులువుగా డబ్బు సంపాదించాలని కుట్ర పన్నారు.

దీనిలో భాగంగా ఆన్‌లైన్‌లో అశ్లీల వెబ్‌సైట్‌ను ప్రారంభించారు.

వీరికి పరిచయం వున్న మహిళల పేర్లను వెబ్‌సైట్‌లో పెట్టి వారి చేత మగవారిని ట్రాప్ చేయడం మొదలుపెట్టారు.వ్యక్తిగతంగా కలవకుండా కేవలం ఫోన్‌లో మాటలతో మభ్యపెట్టడం.

అందినకాడికి దోచుకున్న తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ చేయడం చేసేవారు.పథకంలో ఎక్కువగా సింధూనే మగవారితో మాట్లాడేది.

వేరే అమ్మాయిలు మాట్లాడితే వారికి సగం డబ్బులిచ్చేవారు.అలా మూడేళ్లుగా అనేక మందిని బుట్టలోకిలాగి ఇప్పటి వరకు రూ.60 లక్షలకు పైగా డబ్బులు సంపాదించారు.

ఈ క్రమంలో విజయనగరానికే చెందిన ఎన్ఆర్ఐ సైతం వెబ్‌సైట్‌లో ఓ ఫోన్ నెంబర్‌కు ఫోన్ చేశాడు.

తియ్యని గొంతుతో వలపు వల వేసిన ఓ యువతి అతనిని తన బుట్టలో వేసుకుంది.అలా ప్రతిరోజూ వారిద్దరూ ఛాటింగ్ చేసుకునేవారు.ఈ క్రమంలోనే రూ.8,500 పంపిస్తే వీడియో కాల్‌లో నగ్నంగా కనిపిస్తానని ఆమె చెప్పడంతో సంబరపడిపోయాడు.పట్టరాని సంతోషంలో రూ,8,500కు బదులు పొరపాటుగా రూ.85,000ను ఆమె ఖాతాలోకి ట్రాన్స్‌ఫర్ చేశాడు.

Telugu Honey Trap, Websites, Phone, Sidhuja, Sp Rajakumari, Vizianagaram-

జరిగిన తప్పుని గుర్తించి వెంటనే ఆమెకు ఫోన్ చేశాడు.అయితే ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో తాను మోసపోయినట్లు గ్రహించాడు.వెంటనే అమెరికా నుంచి జిల్లా ఎస్పీకి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశాడు.దీనికి స్పందించిన ఎస్పీ రాజకుమారి.కేసును దర్యాప్తు జరపాల్సిందిగా టూటౌన్ పోలీసులను ఆదేశించారు.రంగంలోకి దిగిన పోలీసులు అశ్విన్, సింధూలను అదుపులోకి తీసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube