ఫ్రెండ్ కోసం పోలీస్ ఇంట్లో దొంగ‌త‌నం.. చివ‌ర‌కు ట్విస్టు! 

Police Burglary At Home For A Friend A Twist To The End

తప్పులు అందరూ చేస్తారు.కానీ కొందరు మాత్రమే దానిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తారు.

 Police Burglary At Home For A Friend A Twist To The End-TeluguStop.com

కొందరికి తప్పులు చేయడం సరదా అయితే.మరి కొందరికి అవసరం.

అలాగే దొంగతనాలు కూడా.కొందరు అత్యవసరం కోసం దొంగతనం చేస్తే.

 Police Burglary At Home For A Friend A Twist To The End-ఫ్రెండ్ కోసం పోలీస్ ఇంట్లో దొంగ‌త‌నం.. చివ‌ర‌కు ట్విస్టు -General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మరి కొందరు దొంగతనాన్నే వృత్తిగా స్వీకరిస్తారు.కానీ కొందరు మంచి దొంగలు ఉంటారు.

అలాంటి ఓ దొంగ గురించే మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది.

తన స్నేహితుడు అనారోగ్యంతో ఉన్నాడని, డబ్బులు లేకపోతే ప్రాణాలు దక్కవని తెలిసి ఓ వ్యక్తి దొంగతానికి పాల్పడ్డాడు.

అదీ ఎవరింట్లో అనుకున్నారు.ఓ పోలీసాఫీసర్​ ఇంట్లో.

అవునండీ నిజం.మధ్యప్రదేశ్​లో జరిగిందీ ఘటన.తన స్నేహితుడి ప్రాణాలు దక్కాలంటే దానికి డబ్బు అవసరం అని, అందుకోసమే దొంగతనం చేస్తున్నానని లేఖ రాసి మరీ వెళ్లాడు ఆ వ్యక్తి.సారీ మంచి దొంగ.

‘నాకు డబ్బు చాలా అర్జెంట్​గా అవసరం ఉంది.నా ప్రాణ స్నేహితుడు హాస్పిటల్​లో చికిత్స పొందుతున్నాడు.

వాడిని కాపాడుకోవాలంటే డబ్బు కావాలి.నా వద్ద ప్రస్తుతం అంత డబ్బు లేదు.

ఇక ఏం చేయాలో పాలుపోక ఈ దొంగతనం చేస్తున్నాను.డబ్బులేకపోతే నా స్నేహితుడు బతకలేడు.

నా వద్ద డబ్బు సమకూరిన వెంటనే మీ డబ్బు తిరిగి మీకు ఇచ్చేస్తాను.నన్ను క్షమించండి.

అంటూ ఓ లెటర్​ రాసి పెట్టి మరీ వెళ్లాడు.

Telugu Burglary Friend, Friend, Madhya Pradesh, Theft, Thief, Thief Letter-Latest News - Telugu

ఈ లెటర్​ రాయడం వల్ల దొంగపై గౌరవం అమాంతం పెరిగింది కదా.ఈ రోజుల్లో సొంత అన్నదమ్ముళ్లనే ఎవరూ పట్టించుకోవడం లేదు.కానీ ఒక స్నేహితుడి కోసం ఇంత రిస్క్​ చేశాడంటే మంచి వ్యక్తే అని ఈ విషయం తెలిసిన నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

కానీ స్నేహితుడి కోసం ఇలాంటి పని చేయాలా అని విమర్శలు కూడా వస్తున్నాయి.పోలీసు అధికారి, వారి కుటుంబ సభ్యులు గత నెల 30వ తేదీన బంధువుల ఇంటికి వెళ్లారు.

తిరిగి వచ్చేసరికి ఇంట్లో సమాను అంతా చిందర వందరగా పడి ఉంది.ఇది చూసి ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు బీరువా తెరిచి చూశారు.అందులో బంగారం, వెండి చోరికి గురయ్యారని నిర్ధారణకు వచ్చారు.వెంటనే దగ్గరలోని పోలీసు స్టేషన్​కు వెళ్లి ఫిర్యాదు చేశారు.

పోలీసులు వచ్చి దర్యాప్తు ప్రారంభించారు.కానీ ఆ దొంగ ఎవరిన్నది ఇంకా తెలియరాలేదు.

#Friend #Thief #Madhya Pradesh #Burglary Friend #Thief Letter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube