మానవత్వం మరిచిన కానిస్టేబుల్స్.. కొంపలు ముంచుతున్న అత్యుత్సాహం.. ?

సమాజంలో మంచి చెడులనేవి ఎప్పుడు ఒక పక్కన ఉండవు.కొందరు ప్రాణం పోసే వారుంటే, వారికంటే రెండితలు ప్రాణాలు తీసే వారుంటారు.

 Police Brutality Against Driver-TeluguStop.com

మానవత్వంతో ప్రవర్తించే వారికంటే కర్కశంగా హింసించే వారే ఎక్కువగా ఉంటారు.ముఖ్యంగా పోలీసులంటే ప్రజల్లో ఉన్న నమ్మకం గురించి కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు.

పోలీసులంటే ప్రజల సేవకోసమే నియమించబడ్ద భటులని ప్రజలకు తెలియపరచడానికి కొందరు అధికారులు శ్రమిస్తున్న క్రమంలో మరికొందరు డిపార్ట్‌మెంట్‌కు అపవాదు వచ్చేలా ప్రవర్తిస్తున్నారు.ఇకపోతే సంగారెడ్డి జిల్లాలో పోలీసు కానిస్టేబుల్స్ మానవత్వం మరిచి ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది.

 Police Brutality Against Driver-మానవత్వం మరిచిన కానిస్టేబుల్స్.. కొంపలు ముంచుతున్న అత్యుత్సాహం.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ రోజు ఉదయం పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తున్న క్రమంలో సదాశివపేటకు చెందిన వాజిద్ అనే వ్యక్తి తన బోలేరో వాహనాన్ని పోలీసుల ముందు కాకుండా కొద్ది దూరంలో ఆపడంతో అక్కడ తనిఖీలు నిర్వహిస్తున్న కానిస్టేబుల్స్ ఆవేశంతో వాజిద్‌ను లాఠీలతో దారుణంగా కొడుతూ, బూతులు తిడుతూ, బూటు కాళ్లతో తన్నారట.ఈ క్రమంలో ఆ డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయని సమాచారం.

ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పుకుంటూ ఈ రకంగా అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్న పోలీసుల విషయంలో అధికారులు కాస్త ఒక కన్ను వేయాలని బాధితులు వేడుకుంటున్నారట.

#Sangareddy #Driver #Police #Sadashivpet

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు