ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై హత్యయత్నం నిందితుడుని పట్టుకున్న పోలీసులు..

వెస్ట్ జోన్ డీసీపీ జ్యోయల్ డెవిస్.అగస్ట్ 1 ఆర్మూర్ ఎమ్మెల్యే పై హత్యయత్నం జరిగిందని ఫిర్యాదు వచ్చింది.

 Police Arrested The Accused Of Murder Attempt On Armor Mla Jeevan Reddy Details,-TeluguStop.com

ఎమ్మెల్యే ఇంట్లో ఎయిర్ పిస్టల్, డ్రాగర్ తో వచ్చి హత్యాయత్నం చేయబోయాడు ప్రసాద్.ఎమ్మెల్యే కేకలు వేయడంతో పారిపోయాడు.

బంజారాహిల్స్ పోలీసులు ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.నిన్న రాత్రి నిందితుడు ని పట్టుకున్నాం.

ఎయిర్ రైఫిల్, పిల్లెట్స్ ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నాం.తన భార్య సర్పంచ్ గా పని చేస్తున్న సమయంలో 20 లక్షల పనులు చేశారు.

ఎంపీఓ కు సబ్ మిట్ చేసిన నివేదిక ఆధారంగా సర్పంచ్ ను సస్పెండ్ చేశారు.

కాని గతంలో చేసిన పనులకు సంబంధించిన డబ్బులు రాలేదు.

దీంతో ఎంపిఓ పై దాడి చేశాడు.దీని పై కేసు నమోదు చేశారు.తన భార్య సస్పెన్షన్ గురికావడం వెనకాల ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హస్తముందని భావించి అతనిపై కక్ష పెంచుకున్నాడు.28 ఏప్రిల్ నా కంట్రీ మేడ్ తుపాకిని నాందేడ్ దగ్గర కొనుగోలు చేశాడు.సంతోష్ అనే వ్యక్తి సహాయంతో ఏయిర్ పిస్టల్, పిల్లట్స్ ని కొనుగోలు చేశాడు.జులై మొదటి వారంలో పరిచయమైన సుగుణ, సురేందర్ లో సహాయంతో కంట్రీమేడు తుపాకి 60 వేలకు కొనుగోలు చేశాడు.

మున్నాకుమార్ అనే వ్యక్తికి నగదు బదిలీ చేశాడు.

సురేందర్, ప్రసాద్ కు కంట్రీ మేడ్ తుపాకిని హ్యాండ్ ఓవర్ చేసాడు.

కానీ బుల్లెట్లు మాత్రం ఇవ్వలేదు.నాందేడ్ కు వస్తే ఇస్తానని చెప్పాడు మున్నా కుమార్.

అక్కడికి వెళ్ళిన అతనికి అవి అందలేదు.దీంతో తిరిగి వచ్చేశాడు.

సుగుణ, సురేందర్, మున్నా కుమార్, సంతోష్ ల పాత్ర ఉంది.వీరిని త్వరలో పట్టుకుంటాం.

ప్రసాద్ పై ఆరు కేసులు ఉన్నాయి.ప్రసాద్ ను కస్టడీలోకి తీసుకుంటాం.

జీవన్ రెడ్డి ఇంట్లోని మూడవ అంతస్తులో అతని పై దాడికి యత్నించాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube