లక్షలు ఇచ్చే భార్యను మోసం చేసినందుకు ఉన్నది పోయే ఉంచుకున్నది పోయే ఫేసుబుక్ లో అడ్డం గా బుక్కయ్యాడు  

తెలుగులోని పాపులర్‌ సామెత ‘ఉన్నది పోయే ఉంచుకున్నది పోయే’. అంటే ఉన్నదాని కోసం సంతృప్తి పడకుండా మరోదాని కోసం ప్రయత్నిస్తే రెండు పోతాయి అనేది దీని అర్థం. జీవితంలో సంతృప్తితో బతికితేనే సంతోషంగా ఉండగలం. సంతృప్తి లేకుండా ఎప్పుడు కొత్తదాని కోసం ఏదోలా సంపాదించాలి, బాగా సంతోషంగా ఉండాలనుకుంటే మొదటికే మోసం వస్తుంది. తాజాగా నల్లవల్లి కిషోర్‌ రెడ్డికి అదే పరిస్థితి ఏర్పడింది. భార్య అమెరికాలో సంపాదిస్తూ నెలకు లక్షలు పంపిస్తూ వస్తుంది. అవి సరిపోవన్నట్లుగా మరో పెళ్లి చేసుకుని కట్నం డబ్బులను తన ఖాతాలో వేసుకోవాలనుకున్నాడు. ఆ విషయం మొదటి భార్యకు తెలిసి మొత్తం సీన్‌ రివర్స్‌ అయ్యింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే…

రంగారెడ్డి జిల్లాకు చెందిన 30 ఏళ్ల నల్లవల్లి కిషోర్‌ రెడ్డి కొన్నాళ్ల క్రితం బీటెక్‌ చదివిన ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఆ అమ్మాయిని నమ్మించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకే ఆ అమ్మాయికి అమెరికాలో ఉద్యోగం వచ్చింది. కిషోర్‌ రెడ్డి కూడా అమెరికాకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. కాని ఆమెతో వెళ్లేందుకు కిషోర్‌కు వీసా రాలేదు. వీసా రాకపోవడంతో హైదరాబాద్‌లోనే ఉండి పోయాడు. భర్త కిషోర్‌ రెడ్డి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశ్యంతో నెలకు లక్షన్నర రూపాయలు ఆమె పంపిస్తూ ఉండేది. ఆ డబ్బుతో కిషోర్‌ జల్సాలకు మరిగాడు. నాగోల్‌లో ఒక ఫ్లాట్‌ కొనుగోలు చేసి ఇంకా ఆస్తులను కూడా కొనుగులోలు చేశాడు.

Police Arrested Man Getting Ready For Second Marriage-Ranga Reddy District Marriage

Police Arrested Man Getting Ready For Second Marriage

త్వరలోనే కిషోర్‌ రెడ్డిని అమెరికాకు తీసుకు వెళ్లేందుకు ఆమె ప్రయత్నాలు చేస్తుంది. ఈ సమయంలోనే కిషోర్‌ రెడ్డి కుటుంబ సభ్యులు చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు సిద్దం అయ్యాడు. పెళ్లి నిశ్చితార్థం కూడా జరిగింది. నిశ్చితార్థం ఫొటోలు ఎవరో ఫేస్‌బుక్‌ లో పెట్టారు. ఆ ఫొటోలు అటు ఇటు తిరుగుతూ అమెరికాలో ఉన్న కిషోర్‌ భార్యకు చేరాయి. తాను కష్టపడి నెల నెల డబ్బులు సంపాదిస్తు ఉంటే, నన్ను వదిలేసి మరో అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు సిద్దం అయ్యాడు అంటూ కుటుంబ సభ్యులతో హైదరాబాద్‌లో కేసు పెట్టించింది. కేసు నమోదు చేసిన పోలీసులు కిషోర్‌ రెడ్డిని ఎంక్వౌరీ చేస్తున్నారు.

ఇదే సమయంలో కిషోర్‌ రెడ్డితో తాను కలిసి జీవితాన్ని పంచుకోలేను అంటూ విడాకులకు అప్లై చేసింది. మరో వైపు నిశ్చితార్థం కూడా క్యాన్సిల్‌ అయ్యింది. ఇలా రెండు వైపుల కూడా కిషోర్‌ రెడ్డి ఇబ్బంది పడటంతో పాటు, కేసుల పాలయ్యాడు. హాయిగా మొదటి భౄర్య పంపించే డబ్బులతో కాలం వెల్లదీస్తూ, వీలు కలిగినప్పుడు అమెరికా వెళ్తే అయిపోయేది కదా… దేనికైనా రాసి పెట్టి ఉండాలి.