ధీక్ష భగ్నం  

Police Arrested In Aswathamma Reddy-aswathamma Reddy,telangana Rtc Strike

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ కార్మికుల ఐక్య కార్యచరణ సమితి కన్వినర్‌ అశ్వత్థామరెడ్డి నిరాహార దీక్షకు దిగాడు.ఇంట్లోనే గృహ నిర్భందం చేసుకున్న ఆయన దీక్షకు దిగాడు.దీక్ష చేస్తే ఆయన ఆరోగ్యం క్షీణిస్తుందని వైధ్యులు సూచించడంతో వెంటనే పోలీసులు ఆయన్ను దీక్ష విరమింపజేసేందుకు ప్రయత్నించారు.కాని ఆయన ఇంట్లో ఉండి తలుపు వేసుకోవడం వల్ల పోలీసులు మొదట వెనకాడారు.

Police Arrested In Aswathamma Reddy-aswathamma Reddy,telangana Rtc Strike Telugu Political Breaking News - Andhra Pradesh,Telangana Partys Coverage-Police Arrested In Aswathamma Reddy-Aswathamma Reddy Telangana Rtc Strike

కొద్దిసేపటి క్రితం పోలీసులు ఆయన ఇంటి తలుపులను బద్దలు కొట్టి వెళ్లారు.దీక్ష చేస్తున్న అశ్వత్థామరెడ్డి వద్దకు పోలీసులు వెళ్లకుండా ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున అడ్డు పడ్డారు.కాని పోలీసులు లాఠీ చార్జ్‌ చేయడంతో పాటు ఎత్తి అవతల వేస్తూ ఆయన వద్దకు చేరుకున్నారు.ఆయన్ను ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు.

దాంతో అశ్వత్థామరెడ్డి దీక్ష విరమించినట్లయ్యింది.ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం మరియు ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయడం వంటి డిమాండ్లతో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెల్సిందే.కాని ప్రభుత్వం మాత్రం ఆర్టీసీ డిమాండ్లకు అస్సలు ఒప్పుకోవడం లేదు.రెండు వర్గాల వాదన బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఎవరికి మద్దతు ఇవ్వాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది.