అఖిల్‌ పేరుతో మోసం

క్రేజ్‌ ఉన్న వారి పేర్లతో ఫేస్‌బుక్‌ మరియు ట్విట్టర్‌లలో ఫేక్‌ అకౌంట్లు క్రియేట్‌ అవుతూ ఉంటాయి.ఆ ఫేక్‌ అకౌంట్లలో కొందరు ఆ సెలబ్రెటీల పరువును దెబ్బ తీసేలా కొందరు పోస్ట్‌లు చేస్తూ ఉంటారు.

 Police Arrested Fake Akkineni Akhil-TeluguStop.com

తాజాగా అలాంటి సంఘటనే జరిగింది.అక్కినేని ప్రిన్స్‌ అఖిల్‌ పేరుతో ఒక ఫేక్‌ అకౌంట్‌ను అభినవ్‌ అనే యువకుడు క్రియేట్‌ చేశాడు.

గత కొన్ని నెలలుగా ఆ అకౌంట్‌ను నడుపుతూ అఖిల్‌లా నమ్మించాడు.దాంతో అఖిల్‌ పేరుతో ఉన్న ఆ అకౌంట్‌ను ఫాలో అయ్యే వారి సంఖ్య భారీగా పెరిగింది.

ఈ క్రమంలోనే అభినవ్‌ తన అసలు బుద్దిని బయట పెట్టాడు.ఫేస్‌బుక్‌లో తనకు పరిచయం అయిన ఒక యువతితో అఖిల్‌లా చాటింగ్‌ చేశాడు, అఖిల్‌నే అంటూ మోసం చేయడం మొదలు పెట్టాడు.

చాటింగ్‌ సందర్బంగా అభినవ్‌ డబ్బు ప్రస్థావన తీసుకు రావడంతో ఆ యువతికి అసలు విషయం అర్థం అయ్యింది.దాంతో అతడి మోసాన్ని బయట పెట్టాలనే ఉద్దేశ్యంతో తన సోదరుడితో కలిసి ఆపరేషన్‌ నిర్వహించింది.

ఆ యువతికి అనుకున్నట్లుగానే అభినవ్‌ చిక్కాడు.దాంతో అతడిని చితక బాది మరొకరిని ఇలా మోసం చేయవద్దనే ఉద్దేశ్యంతో పోలీసులకు అభినవ్‌ను అప్పగించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube