చదువుల్లో గోల్డ్ మెడల్... చేసేది వ్యభిచార దందా! దారి తప్పిన విజ్ఞానం

పెరుగుతున్న టెక్నాలజీని మంచికి ఉపయోగించుకోవచ్చు.చెడుకి ఉపయోగించుకోవచ్చు.

 Police Arrested Btech Year Student On High Tech Prostitution Racket-TeluguStop.com

మంచికి ఉపయోగించి చదువులో నైపుణ్యాలు పెంపొందించుకునే వారు ఉన్నత స్థానాలకి ఎదుగుతున్నారు.అదే విజ్ఞానాన్ని తప్పుడు పనులకి ఉపయోగించి దారితప్పిన మేధావులు కటకటాల పాలవుతున్నారు.

ఇప్పుడు అలాంటి సంఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది.పాలిటెక్నిక్ లో గోల్డ్ మెడల్ సాధించి ఉన్నత ఆశయాలతో బీటెక్ చేరిన వీరబ్రహ్మం అనే యువకుడు హైటెక్ వ్యభిచార దందా నిర్వహిస్తూ పోలీసులకి అడ్డంగా దొరికిపోయాడు.

ప్రస్తుతం బీటెక్ ఫైనలియర్ చదువుతున్న వీరబ్రహ్మం ఓ యాప్ ద్వారా కాల్ గాళ్స్ కోసం వెతికాడు.ఈ క్రమంలో రవి అనే వ్యక్తి అతనికి పరిచయమై కాల్ గర్ల్స్ కోసం హైదరాబాద్ పంపించాడు.

అక్కడికి వెళ్ళాక తాను మోసపోయిన విషయం అతనికి తెలిసింది.తన దగ్గర డబ్బులు తీసుకున్న వ్యక్తి నెంబర్ స్విచ్ ఆఫ్ వచ్చింది.

దీనిపై పోలీసులకి ఫిర్యాదు చేసిన వారు నిర్లక్ష్యం చేశారు.అయితే దీనిని అవకాశంగా భావించి తాను కూడా ఇలా డబ్బులు సంపాదించొచ్చు అని ఆన్ లైన్ లో నెంబర్ పెట్టి తనకి తెలిసిన యువతులని తీసుకొచ్చి వ్యభిచారం చేయించడం మొదలెట్టాడు.

అలాగే ఈజీ మనీ కోసం ఆశ పడే కాలేజీ అమ్మాయిలని ఓ వివాహిత సాయంతో వ్యభిచారం వైపు మల్లించేవాడు.అమ్మాయిలకి కూడా ఒక్క రాత్రికి వేల రూపాయిలు వచ్చేసరికి చాలా మంది వాడి వలలో చిక్కుకున్నారు.

అయితే ఈ వ్యవహారం అంతా ఓ ఇంట్లో నిర్వహిస్తూ ఉన్నాడు.అక్కడికి తరుచుగా అమ్మాయిలు, అబ్బాయిలు రావడం స్థానికులు గ్రహించి పోలీసులకి సమాచారం ఇచ్చారు.

దీంతో పోలీసులు ఆ ఇంటిపై దాడి చేసి వీరబ్రహ్మంని అదుపులోకి తీసుకున్నారు.అతను ఒక యాప్ ద్వారా ఈ వ్యవహారం అంతా నడిపిస్తున్నట్లు గుర్తించారు.

ఇక అతని ఫోన్‌లో తెలుగు రాష్ట్రాల్లో అనేక కాలేజీల్లో చదువుతున్న అమ్మాయిలు నెంబర్లు కూడా ఉన్నట్లు గుర్తించారు.దీంతో ఈ వ్యవహారంపై పోలీసులు సీరియస్ గా దృష్టి పెట్టారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube