బర్త్ డే పార్టీలో కేక్ కట్ చేసినందుకు వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు..!

ఎవరైనా సరే పుట్టినరోజు వేడుకలు అంటే కచ్చితంగా కేక్ కట్ చేస్తారు.అందరిమాదిరే ఓ వ్యక్తి కేక్ కట్ చేశాడు.

 Police Arrested A Man For Cutting A Cake At A Birthday Party, Birthday, Cake,cak-TeluguStop.com

అయితే కేక్ కట్ చేసినందుకు అతడిని పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో ఉంచారు.అదేంటి బర్త్ డే కేక్ కట్ చేస్తే అరెస్టు చేయటం ఏంటి అని అనుకుంటున్నారా.? అసలు కేక్ కట్ చేస్తే అతడిని జైల్లో పెడతారా.? పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారు అని కొందరు అనుకోవచ్చు.కానీ నిజానికి ఓవరాక్షన్ చేసింది పోలీసులు కాదు ఆ బర్త్ డే వ్యక్తి.

మామూలుగా అందరూ పుట్టినరోజు వేడుకలు చేసుకుంటారు.

మరికొందరైతే మితిమీరి ఆ వేడుకలను అంగరంగా జరిపిస్తారు.ఆ కార్యక్రమంలో ఏదో ఒక అబ్బురపరిచే సంఘటన చేసి అందరితో ఆహా… ఓహో… అనిపించుకునేలా చేయడానికి కూడా సిద్ధమైపోతారు.

ఇక అసలు విషయంలోకి వెళితే… ఇలాంటి సంఘటనే 27 ఏళ్ల పుట్టినరోజు అబ్బాయి కేక్ కటింగ్ వేడుకలలో జరిగింది.మహారాష్ట్రలో నాగపూర్ కు చెందిన అఖిల్ వాడే అనే ఓ వ్యక్తి తన పుట్టిన రోజు సందర్భంగా పార్టీ ని ఏర్పాటు చేయగా అందులో కేక్ కటింగ్ ను వినూత్నంగా చేయాలి అనుకున్నాడు.

మామూలుగా ఎవరైనా కేకు ను కోయడానికి ఓ చిన్న చాకుతో కట్ చేస్తారు.కానీ, అతను మాత్రం స్పెషల్ అనిపించుకోవడానికి చిన్న చాకు బదులు ఏకంగా బారెడు పొడవుగా ఉన్న కత్తితో అతి వీర భయంకరంగా కేకును కట్ చేశాడు.

ఇక ఈ విషయం పోలీసులకు తెలియడంతో మారణాయుధాల చట్టం కింద పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.

ప్రస్తుతం ఈ పుట్టిన రోజుకు సంబంధించిన కేక్ కటింగ్ సీన్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

అయితే అతను ఇంతకు ముందు కూడా ఇలాంటి పిచ్చి పనులు చేసినట్లు తెలుస్తోంది.దీంతోనే కాబోలు అతడిని పోలీసులు కటకటాల వెనక్కి పంపించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube