యోగా చేస్తున్న 30 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు... అసలు విషయం ఏమిటంటే!

యోగా అనేది ఆరోగ్యానికి మంచిది అని చిన్నా,పెద్దా అందరూ కూడా యోగా చేయాలనీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ ప్రచారం కూడా చేస్తున్నారు.కానీ ఆ దేశంలో మాత్రం యోగా చేస్తున్న 30 మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది.

 Police Arrested 30 People Who Performing Yoga-TeluguStop.com

ఆ దేశంలో యోగా పై నిషేధమో ఏమో గానీ 30 మందిని అరెస్ట్ చేసారు.ఇంతకీ ఆ దేశం ఏంటో తెలుసా ఇరాన్.

అవునండీ ఇరాన్ దేశంలో యోగా నేర్చుకుంటున్న వారితో పాటు నిర్వహిస్తున్న యోగా టీచర్ ను సైతం మొత్తం 30 మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది.అయితే ఇంతకీ అసలు విషయం ఏమిటంటే లైసెన్స్ లేకుండా వారు యోగా క్లాసులు నిర్వహించడమే ఈ చర్యకు కారణంగా తెలుస్తుంది.

ఇరాన్ లో లైసెన్స్ లేకుండా యోగా క్లాసులు నడపడం,పైగా లైసెన్స్‌తో నడిపేవారు కూడా కేవలం ఆడవారికి లేదా మగవారికి వారికి మాత్రమే నేర్పాల్సి ఉంటుంది.

అయితే ఏ మాత్రం నియమాలు వారు పాటించకపోవడం తో వారందరిని అరెస్ట్ చేసారు పోలీసులు.

ఇరాన్ లో ఒక్క యోగానే కాదు ఏ విధమైన క్రీడల శిక్షణలో అయినా ఆడవారికి, మగవారికి కలిపి శిక్షణ ఇవ్వకూడదు అని అక్కడ ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది.అంతేకాకుండా రిథమిక్ మోషన్స్, జుంబా డాన్స్ లాంటి వాటిని సైతం నిషేధిస్తున్నట్టు 2017లో ఇరాన్ క్రీడాశాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే.

అందుకే యోగా ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ లైసెన్స్ లేకపోవడం,ఇంకా ఆడవారికి,మగవారికి సపరేట్ గా క్లాసులు నిర్వహించక పోవడం వంటి కారణాల తో పోలీసులు ఇలాంటి చర్యలు తీసుకుంటారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube