కడప జిల్లాలోని కలసపాడు మండలం మామిళ్లపల్లె గ్రామ పరిధిలోని ముగ్గురాయి గనుల్లో ఈ నెల 8న జరిగిన పేలుళ్లలో 10 మంది కూలీలు దుర్మరణం పాలైన విషయం తెలిసిందే.కాగా ఈ విస్ఫోట తీవ్రతకు కూలీల శరీరాలు ఛిద్రమయ్యాయి.
నెత్తుటి ముద్దలు తప్ప అవయవాలకు ఆకారమే లేకుండా, మృతదేహ భాగాలూ చెల్లాచెదురుగా పడ్డాయి.
ఇలా కూలీల బ్రతుకులను కాలరాసిన పేలుళ్లకు సంబంధించిన కేసులో వైసీపీ నేత సి.నాగేశ్వరరెడ్డి, పేలుడు పదార్థాలు సరఫరా చేసిన రఘునాథ్‌రెడ్డిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారట.ఇదిలా ఉండగా పేలుడు పదార్థాల నిర్వహణలో అజాగ్రత్తగా వ్యవహరించడం వల్లే ప్రమాదం జరిగిందని సమాచారం.
అయితే ఈ ముగ్గురాయి గనిని వైసీపీ నేత సి.నాగేశ్వరరెడ్డి 2013లో జీపీఏ తీసుకుని, పర్యావరణ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నట్లుగా తెలిందట.ఇప్పటికే ఈ ఘటన పై పలు రాజకీయ పార్టీ నేతలు తీవ్రంగా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న నేపధ్యంలో వైసీపీ నేతను అరెస్ట్ చేసిన పోలీసులు ఈ కేసులో నిందితులకు తగిన శిక్ష విధించి మరణించిన కూలీల కుటుంబాలను న్యాయం చేస్తారో, లేక మధ్యలోనే కేసును మట్టిలో కలిపేస్తారో చూడాలి అనుకుంటున్నారట ఏపీ ప్రజలు.