ఆస్ట్రేలియా: లాక్‌డౌన్ వద్దు.. రోడ్ల మీదకు చొచ్చుకొచ్చిన జనం, వందలాది అరెస్ట్‌లు

కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం గడిచిన కొన్ని వారాలుగా లాక్‌డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.అయినప్పటికీ కేసుల తీవ్రత మాత్రం తగ్గడం లేదు.

 Police Arrest Hundreds Of Protesters As Australia Reports Record Covid-19 Cases-TeluguStop.com

మరోవైపు నెలల తరబడి తమను నాలుగు గోడల మధ్య బంధించడాన్ని జనం జీర్ణించుకోలేకపోతున్నారు.తమకు లాక్‌డౌన్ నుంచి విముక్తి కావాలంటూ శనివారం సిడ్నీ, మెల్‌బోర్న్ నగరాల్లో వేలాది మంది జనం రోడ్ల మీదకి చొచ్చుకొచ్చారు.

ఈ ఊహించని పరిణామంతో అవాక్కయిన పోలీసులు, సైన్యం గుంపును చెదరగొట్టి వందలాది మందిని అదుపులోకి తీసుకున్నారు.మెల్‌బోర్న్‌లో మౌంట్ పోలీసులు పెప్పర్ స్ప్రేను ఉపయోగించి.

పోలీస్ లైన్‌ల వైపు పరిగెడుతున్న 4,000 మందిని చెదరగొట్టారు.అయితే సిడ్నీలో మాత్రం పోలీసులను ఆందోళనకారులు ప్రతిఘటించారు.

మెల్‌బోర్న్‌లో 218 మందిని అరెస్ట్ చేసినట్లు విక్టోరియా పోలీసులు తెలిపారు.పోలీసులపై దాడి చేసినందుకు గాను 236 మందికి జరిమానాలు విధించామని తెలిపారు.ప్రజారోగ్య నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను అరెస్ట్ అయిన ప్రతి ఒక్కరికి 5,452 డాలర్లు జరిమానా విధించారు.ఇక సిడ్నీ విషయానికి వస్తే.

ప్రజారోగ్య నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను 47 మందిని అరెస్ట్ చేసి వారిపై జరిమానా విధించారు.

ఆస్ట్రేలియాలో అతిపెద్ద నగరమైన సిడ్నీ గడిచిన రెండు నెలల నుంచి లాక్‌డౌన్‌లో వుంది.

డెల్టా వేరియంట్‌ వ్యాప్తికి కేంద్రంగా వున్న సిడ్నీలో శనివారం కొత్తగా 894 కొత్త కేసులు నమోదైనట్లు కథనాలు వస్తున్నాయి.ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు.సిడ్నీ వీధుల్లో గస్తీ నిర్వహించారు.అనధికారికంగా నిరసనల్లో పాల్గొనే వ్యక్తుల సంఖ్యను తగ్గించేందుకు గాను సిటీ సెంటర్‌లోకి ప్రైవేట్, ప్రజా రవాణాను నిలిపివేశారు.

Telugu Daylockdown, America, Australia, Delta, Lockdown, Melbourne, Sydney, Vict

మరోవైపు, అగ్రరాజ్యం అమెరికాలోనూ వైరస్ విజృంభిస్తోంది.శుక్రవారం ఒక్కరోజే 3.77 లక్షల మంది కొత్త రోగులను గుర్తించారు.ఇది జనవరి 25 తర్వాత అత్యధికం.

అటు దేశంలోని జైళ్లలో అంటువ్యాధి కేసులు పెరిగాయి.అంతేకాకుండా ఇన్‌ఫెక్షన్ రేటు 34 శాతానికి చేరుకోవడంతో అధికారులు ఆందోళనకు గురవుతున్నారు.

అన్ని జైళ్లలో సామర్థ్యం కంటే ఖైదీల సంఖ్య ఎక్కువగా ఉన్నది.ఇదే సమయంలో, ఆరు నెలల తర్వాత కరోనా కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత న్యూజిలాండ్‌లో 3 రోజుల లాక్‌డౌన్ విధించారు.

దీనిని శుక్రవారం కూడా కొనసాగించారు.రోగిని కలిసిన వ్యక్తుల కోసం ఆరా తీస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube