సీతారామం యూనిట్ కి పోలాండ్ అభిమాని ప్రేమలేఖ.. ఎమోషనల్ రిప్లై ఇచ్చిన హీరో?

డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం సీతారామం.ఈ సినిమా ఒక అద్భుతమైన ప్రేమ కావ్య చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

 Poland Woman Emotional Letter To Sitaramam Movie Unit Details, Sitaram,poland Fa-TeluguStop.com

ఈ సినిమా చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఎంతో ఎమోషనల్ గా సినిమాతో కనెక్ట్ అవ్వడమే కాకుండా కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు.ఇలా ప్రతి ఒక్క ప్రేక్షకుడి మదిని తాకిన ఈ సినిమా థియేటర్లో అద్భుతమైన టాక్ సొంతం చేసుకోవడమే కాకుండా ఓటీటీ లో కూడా ఎంతో విజయవంతంగా దూసుకుపోతుంది.

ఇలా ఓటిటిలో కూడా ఎంతో మంచి విజయం సొంతం చేసుకున్న ఈ సినిమాకి కేవలం దక్షిణాది రాష్ట్రాలలోనే కాకుండా ఉత్తరాది రాష్ట్రాలలో కూడా మంచి ఆదరణ వచ్చింది.

ఇకపోతే సోషల్ మీడియా వేదికగా పోలాండ్ కు చెందిన ఓ అభిమాని చిత్ర బృందాన్ని ప్రశంసిస్తూ ఏకంగా నాలుగు పేజీల ప్రేమలేఖ రాశారు.మోనికా అనే పోలాండ్ కు చెందిన ఓ అభిమాని తన ట్విట్టర్ ద్వారా చిత్ర బృందం పై ప్రశంసలు కురిపించడమే కాకుండా తాను లెఫ్టినెంట్ రామ్ ప్రేమలో పడిపోయాను అంటూ నాలుగు పేజీల సుదీర్ఘమైన ప్రేమలేఖ రాశారు.2006వ సంవత్సరం నుంచి తాను అభిమానిగా మారిపోయానని తెలిపారు.సీతారామం సినిమాని షారుక్ ఖాన్ నటించిన వీర్ జారా చిత్రంతో పోల్చింది.స్వచ్చమైన ప్రేమకథ అంటూ ఈ సినిమాపై ప్రశంసలు కురిపించింది.

ఇక హీరో దుల్కర్ సల్మాన్ గురించి రాసుకోస్తూ లెఫ్ట్ నేను డ్రాప్ ప్రేమలో పడిపోయాను.అతడిని ప్రేమించకుండా ఉండలేకపోతున్నాను.

అంత అద్భుతమైన పాత్రను సృష్టించారు అంటూ ఆయనపై ప్రశంసల కురిపించారు.అలాగే హీరోయిన్ పాత్ర గురించి మాట్లాడుతూ ఆ పాత్రలో ఆమె తప్ప మరో వారిని ఊహించుకోలేమని తన పాత్రకు అద్భుతమైన వాయిస్ ఇచ్చినటువంటి సింగర్ చిన్మయి శ్రీపాద గురించి కూడా ఈమె మాట్లాడుతూ.శ్రీపాద లేకుండా సీతామహాలక్ష్మి అసంపూర్ణం అంటూ చిత్ర యూనిట్ అందరి గురించి పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపిస్తూ నాలుగు పేజీల లేఖ రాశారు.

ఇక అభిమాని రాసిన ఈ లేక పై హీరో దుల్కర్ సల్మాన్ ఎమోషనల్ రిప్లై ఇచ్చారు.

ఈ సందర్భంగా దుల్కర్ స్పందిస్తూ అందమైన లేఖ.మీరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు.మిమ్మల్ని మరింతగా అలరించాలని కోరుకుంటున్నాము మాపట్ల మీరు గొప్ప అవగాహనతో ఈ లేఖ రాశారు మీ ప్రతిభకు హాట్సాఫ్ అంటూ దుల్కర్ సల్మాన్ ఈ ట్వీట్ పై రిప్లై ఇచ్చారు.ప్రస్తుతం అభిమాని చేసినటువంటి ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube