పోలాండ్ బుజ్జి నోట‌ పెళ్లిసందడి పాట.. నెట్టింట వైరల్!

తెలుగు సినీ స్టార్ దర్శకుడు రాఘవేంద్ర రావు దర్శకత్వంలో 1996లో విడుదలైన పెళ్లిసందడి సినిమా గురించి అందరికీ తెలిసిందే.ఇక ఇదే టైటిల్ తో మోడ్రన్ పెళ్లి సందడి గా టాలీవుడ్ హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ తో చేయించాడు.

 Poland Bujji Sung Premante Enti-TeluguStop.com

ఈ సినిమాతోనే శ్రీకాంత్ కొడుకు హీరోగా పరిచయం కానున్నాడు.ఇక ఇందులో శ్రీలీల నటిస్తుంది.

ఈ సినిమా ద్వారా కొత్త దర్శకుడు గౌరీ రోనంకి పరిచయమవుతున్నాడు.ఇక ఈ సినిమాకు సంగీతాన్ని కీరవాణి అందిస్తున్న సంగతి తెలిసిందే.మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ సినిమా నిర్మాతలు గా చేస్తున్నారు.ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాలోని ‘ప్రేమంటే ఏంటి’ అనే పాట ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

 Poland Bujji Sung Premante Enti-పోలాండ్ బుజ్జి నోట‌ పెళ్లిసందడి పాట.. నెట్టింట వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఈ పాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఇదిలా ఉంటే ఈ పాట ఓ పోలాండ్ బుజ్జి పాడి వినిపించాడు.

పోలాండ్ కు చెందిన పన్నెండేళ్ల జిబిక్స్ అనే అబ్బాయి ఈ పాటని చక్కగా పాడాడు.అంతేకాకుండా జిబిక్స్ ఇంతకుముందు దొరసాని సినిమా లో పాలపుంత పాటను కూడా వినిపించిన సంగతి తెలిసిందే.

ఇక మన జాతీయ గీతాన్ని కూడా వినిపించి బాగా ఆకట్టుకున్నాడు.ఇక తాజాగా పెళ్లి సందడి పాటతో మళ్లీ ఆకట్టుకున్నాడు ఈ బుడ్డోడు.ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.ఈ పాట వీడియో చూసిన పాట లిరిక్ రైటర్ చంద్రబోస్ ‘ బుజ్జి నోట మా పాట‘ అని తన ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు.

అంతే కాకుండా ఈ సిని నిర్మాణ సంస్థ కూడా మీ ప్రేమకు మా ధన్యవాదాలు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.ఇక భాష రాకపోయినా తెలుగులో మంచిగా పాడాడని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు నెటిజనులు.

#Poland Bujji #Pelli SandaD

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు