ట్రెండ్ మార్చేస్తున్న ఫ్యాన్స్.. హీరోల బర్త్ డేలకు అలా ప్లాన్ చేస్తూ..

మన తెలుగు వారి అభిమానం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఒక్కసారి ఏ హీరోకు అయినా ఫ్యాన్ అయినారంటే ఇక వారిని ఎంతగా అభిమానిస్తారో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు.

 Pokiri And Jalsa On Big Screens For Birthdays , Pokiri, Jalsa, Pawan Kalyan, Paw-TeluguStop.com

అభిమాన హీరో కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు.ఇక వారి పుట్టిన రోజులను ఎంతగా సెలెబ్రేట్ చేస్తారో కూడా చూస్తూనే ఉంటాం.

వారి పుట్టిన రోజులకు కూడా అంతా హంగామా చెయ్యరు.కానీ తమ హీరో పుట్టిన రోజు అంటే మాత్రం ఒక నెల ముందు నుండే హంగామా స్టార్ట్ అవుతుంది.

అయితే ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఫ్యాన్స్ కూడా తమ ట్రెండ్ మారుస్తున్నారు.తమ అభిమాన హీరో కెరీర్ లో క్లాసిక్ హిట్ గా నిలిచి పోయిన సినిమాలను వారి పుట్టిన రోజు వేడుకలను ప్రత్యేకంగా ప్రదర్శిస్తూ వారి అభిమానాన్ని చాటుతున్నారు.

ఎప్పటి నుండో ఇలా చేస్తున్న ఇప్పుడు ఆ ట్రెండ్ మరింత ఎక్కువ అవుతుంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు సూపర్ హిట్ సినిమాల్లో పోకిరి ఒకటి.

టాలెంటెడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన పోకిరి సినిమా మహేష్ ఆల్ టైం హిట్ లలో ఒకటిగా మిగిలి పోయింది.ఈ సినిమా రిలీజ్ అయ్యి 16 ఏళ్ళు అవుతుంది.అయితే ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మరోసారి రీ రిలీజ్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు.4K రిజొల్యూషన్ లోకి రీ మాస్టర్ చేసి డాల్ఫీ ఆడియోతో ఈ సినిమాను థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారు.

ఆగష్టు 9న మహేష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాను ఫ్యాన్స్ కోసం స్పెషల్ ట్రీట్ ఇవ్వడానికి రెడీ చేస్తున్నారు.తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా ఈ ప్రీమియర్స్ వేస్తున్నారు.

ఇప్పటికే టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి.ఇది చూసిన పవర్ స్టార్ ఫ్యాన్స్ ఊరుకుంటారా.

అందుకే తమ హీరో సినిమా కూడా వేయడానికి సిద్ధం అవుతున్నారు.

Telugu Jalsa, Mahesh Babu, Mahesh Babu Day, Nagarjuna, Pawan Kalyan, Pokiri, Pok

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస ప్లాపుల్లో ఉన్న సమయంలో జల్సా వంటి బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది.అలాంటి సినిమాను పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా రీ రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.

జల్సా సినిమాకు 4కే ప్రింట్ కావాలని గీతా ఆర్ట్స్ ను కోరుతున్నారు.పోకిరి ని బీట్ చేసే లెవల్ లో ఉండాలి అని ఆరాటపడుతున్నారు.

ఇక అక్కినేని ఫ్యాన్స్ కూడా ఇందుకు మినహాయింపు కాదు.అక్కినేని నాగార్జున బర్త్ డే కోసం వీరు కూడా గ్రాండ్ లెవల్ లో ప్లాన్ చేస్తున్నారు.

ఆగష్టు 29న నాగ్ తన జన్మదినం జరుపుకో బోతున్నారు.ఈ క్రమంలోనే వైజాగ్ లో రక్షకుడు స్పెషల్ షో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.

ప్రతి ఏడాది వీరు తమ హీరో కోసం ఇలానే చేస్తూ వస్తున్నారు.ఇలా ఫ్యాన్స్ తమ అభిమాన హీరోల కోసం కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube