తలసానితో అదిరే అభి పాయింట్ బ్లాంక్

ఐశ్వర్యం మీడియా క్రియేషన్స్ పతాకంపై అదిరే అభి హీరోగా సస్పెన్స్ థ్రిల్లర్ ‘పాయింట్ బ్లాంక్’ చిత్రాన్ని డా.కొన్నిపాటి శ్రీనాథ్ నిర్మిస్తున్నారు.

 Point Blank Movie First Look Poster Released By Minister Talasani-TeluguStop.com

ఈ సినిమా టైటిల్ లోగో పోస్టర్ ను సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా బుధవారం ఉదయం ఆవిష్కరించారు.ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.

‘‘మనందరికీ సుపరిచితులైనటువంటి అదిరే అభి హీరోగా క్రైమ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందే ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్‌గా చేస్తున్న అభిని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను.ఐశ్వర్యం మీడియా క్రియేషన్స్ ద్వారా తొలి ప్రయత్నంగా ‘పాయింట్ బ్లాంక్’ పేరుతో డా.కొన్నిపాటి శ్రీనాథ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను.అభి సినిమా ఇండస్ట్రీలో కూడా ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
హీరో అదిరే అభి మాట్లాడుతూ.‘‘ఎవరూ ఊహించని కొత్త ట్విస్ట్‌లతో ఈ సినిమా చివరి వరకూ ఆసక్తికరంగా సాగుతుంది.హాలీవుడ్ స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది.ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్‌లో రాని క్రైమ్ పాయింట్‌ని ఆధారంగా చేసుకున్న చిత్రమిది.

ప్రతి సన్నివేశాన్ని దర్శకులు వి.వి.ఎస్.జి ఎంతో అద్భుతంగా తీశారు’’ అన్నారు.

Telugu Adhireabhi, Jabardast, Talasani, Point Blank-Movie

చిత్రనిర్మాత డా.కొన్నిపాటి శ్రీనాథ్ మాట్లాడుతూ.‘‘నేను తొలి ప్రయత్నంగా ఐశ్వర్యం మీడియా క్రియేషన్స్ పతాకంపై ఈ ‘పాయింట్ బ్లాంక్’ చిత్రాన్ని నిర్మిస్తున్నాను.కథనే హీరోగా ఎంచుకుని అదిరే అభిని పోలీస్ ఆఫీసర్ పాత్రలో చేయించడం జరిగింది.

ఈ కథ సస్పెన్స్ థ్రిల్లర్‌గా నిర్మిస్తున్నాము.షూటింగ్ మొత్తం పూర్తయింది.

ఈరోజు తలసానిగారి చేతుల మీదుగా టైటిల్ లోగో పోస్టర్‌ను విడుదల చేశాం.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ఏప్రిల్ నెలలో చిత్ర విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.

Telugu Adhireabhi, Jabardast, Talasani, Point Blank-Movie

అదిరే అభి, హీనా, రేచల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో జీవా, సూర్య, ‘ఛత్రపతి’శేఖర్, సాయి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.ఈ చిత్రానికి కథ: మల్లిక్ చింతకుంట, కెమెరా: కన్నా చింతం, సంగీతం: సాయిపవన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: నవీన్ ఇటిక, ఎడిటర్: క్రాంతి, ఆర్ట్ రమేష్బాబు, సహ నిర్మాతలు: మల్లిక్ చింతకుంట, సుమన్ గంధంశెట్టి, దేవేంద్ర ఇంటూరి, గోపిచంద్ మచ్చ, రవి కిరణ్ చలిచామ, నిర్మాత: కొన్నిపాటి శ్రీనాథ్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.ఎస్.జి

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube