యూట్యూబ్‌లో ఏ వీడియోని ప్లే చేసినా కనీసం 20 సెకండ్ల పాటు ఏదో ఒక యాడ్ చూడాల్సి వస్తోంది.ఒక్కోసారి ఇంట్రెస్టింగ్ పార్ట్ వచ్చినప్పుడే యాడ్స్ ప్రత్యక్షమవుతూ మూడ్ అంతా చెడగొడతాయి.
ఇలాంటప్పుడే చాలా చిరాకు వస్తుంది.అయితే ఎలాంటి యాడ్స్ రాకుండా వీడియోలు ప్లే చేయాలంటే ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి వస్తుంది.
డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా సబ్స్క్రిప్షన్ తప్పనిసరి.యూట్యూబ్ ప్రీమియంకు సబ్‌స్క్రైబ్ కావాలంటే నెలకు రూ.139, మూడు నెలలకు రూ.399, ఏడాదికి రూ.1290 చెల్లించాల్సి వస్తోంది.
అయితే తాజాగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు పోకో యూట్యూబ్ యూజర్లకు తీపి కబురు అందించింది.
భారతీయ యూజర్లు పోకో ఎం4 ప్రో కొనుగోలు చేస్తే చాలు, రెండు నెలల పాటు ఉచితంగా యూట్యూబ్ ప్రీమియం సేవలను ఆస్వాదించొచ్చని ఆ స్మార్ట్‌ఫోన్ సంస్థ వెల్లడించింది.పోకో ఎం4 ప్రో మార్చి నెలలో ఇండియాలో విడుదలైంది.
ఇది ఫ్లిప్‌కార్ట్ ద్వారా 7వ తేదీ నుంచి అమ్మకానికి రానుంది.అయితే కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు యూట్యూబ్‌తో పోకో కంపెనీ కలసి ప్రీమియం సేవలు అందించడం ప్రారంభించింది.

భారతదేశంలో పోకో ఎం4 ప్రో 6జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.13,999 కాగా, 6జీబీ+128జీబీ ధర రూ.15,499, 8జీబీ+128జీబీ ధర రూ.16,999గా నిర్ణయించడం జరిగింది.ఇందులో మీడియాటెక్ హీలియో జీ96 ఎస్ఓసీ ప్రాసెసర్, 6.43 ఇంచుల ఫుల్ హెచ్డీ+ అమోల్డ్ డిస్ప్లే అందించారు.యూట్యూబ్ ప్రీమియంతో ఒక్క యాడ్ ఫ్రీ వీడియో సేవలు మాత్రమే కాదు బ్యాక్‌గ్రౌండ్ ప్లే సేవలను కూడా పొందవచ్చు.వీడియోలను డౌన్లోడ్ చేసుకునే సదుపాయంతో పాటు యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియం సేవలు ఉచితంగా యాక్సెస్ చేయవచ్చు.