ప్రధాని లడఖ్ వెళ్లారు... చైనాకి చెమటలు పట్టింది

గత కొంత కాలంగా భారత్, చైనా సరిహద్దు ప్రాంతమైన లడఖ్ లో యుద్ధ వాతావరణం నెలకొని ఉంది.చైనా దురాక్రమణని అడ్డుకోవడానికి భారత్ కూడా గట్టిగా సన్నద్ధం అయ్యి ఉంది.

 Pm Narendra Modi, Ladakh Trip A Strong Message To China, Indian Government, Cong-TeluguStop.com

ఈ నేపధ్యంలో వేల సంఖ్యలో సైన్యాన్ని అక్కడ మొహరించారు.ఓ వైపు చైనా శాంతి మాత్రం జరిపిస్తూనే మరోవైపు సరిహద్దు వద్ద దురాక్రమణకి పాల్పడుతుంది.

ఇలాంటి సమయంలో భారత్ సైన్యానికి ఆత్మస్థైర్యం నింపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ ముందుంటారు.

ఈ నేపధ్యంలో ఎలాంటి షెడ్యూల్ ప్లాన్ లేకుండా కనీసం రక్షణ మంత్రికి కూడా సమాచారం లేకుండా ప్రధాని మోడీ లడఖ్ లో పర్యటించారు.అతను అక్కడికి వెళ్ళేంత వరకు మోడీ పర్యటన గురించి విషయాలు రహస్యంగా ఉంచారు.

భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో అకస్మాత్తుగా మోదీ పర్యటన జరపడం సంచలనంగా మారింది.సరిహద్దులో మోడీ పర్యటనతో సైనికులకి ఉత్సాహం అందించడంతో పాటు, చైనా సామ్రాజ్యవాద విధానంలో దురాక్రమణ చేసుకుంటూ పోతామంటే ఊరుకునే పరిస్థితి లేదని నేరుగా ఆ దేశ ప్రభుత్వానికి హెచ్చరికలు పంపించారు.

మోడీ హెచ్చరికలతో కంగుతిన్న చైనా సర్కార్ కాస్తా దూకుడు తగ్గించి శాంతి వచనాలు వల్లించడం మొదలు పెట్టింది.చైనా విదేశాంగ శాఖ ఈ విషయంపై స్పందించి సరిహద్దులో తలెత్తిన వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించే దిశలో చర్చలు జరుగుతూ ఉండగా ఇలాంటి సమయంలో ఉద్రిక్తతలు పెంచే ప్రయత్నం చేయడం మంచిది కాదు అంటూ కబుర్లు చెబుతుంది.

భారత్ ని రెచ్చగొట్టి ఇప్పుడు ప్రాణం మీదకి వచ్చేసరికి చైనా ఇలా దొంగ మాటలు మాట్లాడుతుందని విశ్లేషకులు విమర్శిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube