స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ 216 అడుగుల శ్రీ రామానుజ విగ్రహాన్ని ఆవిష్కరించారు దేశ ప్రధాని మోదీ.ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ తెలుగు సినిమా సిల్వర్ స్క్రీన్ పై అద్భుతాలు సృష్టిస్తుందని అన్నారు.
సిల్వర్ స్క్రీన్ నుండి ఓటీటీ వరకు తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగేలా చేస్తుందని అన్నారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ.తెలుగు చలన చిత్ర పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి సంపాదించిందని అన్నారు.
తెలుగు బాష చరిత్ర ఎంతో సుసంపన్నమైందని.కాకతీయుల రామప్ప టెంపుల్ కి యునిస్కో గుర్తింపు రావడం గర్వకారణమని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ.పోచంపల్లి చేనేత వస్త్రాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాయని అన్నారు.తెలుగు సినిమా ప్రక్షాళన గురించి దేశ ప్రధాని మాట్లాడటం ప్రత్యేకంగా నిలిచింది.
తెలుగు సినిమా నేషనల్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకుంది అని చెప్పడానికి ఇది కూడా ఒక మంచి ఎక్సాంపుల్ అని చెప్పొచ్చు.దేశ ప్రధాని తెలుగు సినిమా గురించి ప్రత్యేకంగా తన ప్రసంగంలో ప్రస్థావించడంపై తెలుగు దర్శకులు మోదీ మాట్లాడిన ఆ క్లిప్ ని తమ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
తెలుగు సినిమాకి ఇది నిజంగానే ఒక మంచి తరుణమణి చెప్పుకుంటున్నారు.