G20 Summit: ఇటలీలోని భారతీయ సమాజంతో ప్రధాని మోడీ ఇంటరాక్షన్

ఐదు రోజుల విదేశీ పర్యటన నిమిత్తం ప్రస్తుతం ఇటలీలో వున్న ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ స్థిరపడిన భారత సంతతి ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యారు.ఇందుకు సంబంధించిన ఫోటోలను ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.

 Pm Narendra Modi Says Had Great Interacti On With The Indian Community In-TeluguStop.com

సనాతన్ ధర్మ సంఘ అధ్యక్షురాలు స్వామిని హంసానంద గిరితో కూడా సమావేశమైనట్లు మోడీ చెప్పారు.ఇటలీలో హిందువుగా వుండటం అంత సులభం కాదని.

ప్రధానిని కలవడం గొప్ప గౌరవంగా ఆమె అభివర్ణించారు.

భారతదేశ సంస్కృతి మానవాళికి ఒక నిధి అని ఎందుకంటే ఇది పురాతన కాలం నుంచి వచ్చినదని హంసానంద అన్నారు.

అహింస, ప్రకృతి, పర్యావరణం పట్ల సామరస్యం అనేది భారతీయ సంస్కృతిలో ప్రధానమైనవని ఆమె చెప్పారు.‘‘ సర్వజన్ హితయే’’ .ప్రతి మనిషి.ప్రపంచంలోని ప్రతి జీవి సామరస్యంగా, శాంతితో జీవించాలని అందుకే భారతీయులు ఎప్పుడు శాంతి, శాంతి, శాంతి అంటారని హంసానంద గుర్తుచేశారు.

మనలో విచిత్రమైన దాని గురించి ప్రధాని అడిగారని.అలాగే భారత్‌కు వెళితే అక్కడ ఏం ఇష్టమని ఆయన ప్రశ్నించారని ఆమె చెప్పారు.అందుకు తాను తమిళనాడు అని చెప్పానని.దీంతో మోడీ తమిళంలో మాట్లాడారని హంసానంద గిరి తెలిపారు.

Telugu Summit, Indiancommunity, Italy, Modiindian, Pm Modi Italy, Pmnarendra-Tel

కాగా.శనివారం వాటికన్‌ సిటీలో క్రైస్తవ మతగురువు పోప్‌ ఫ్రాన్సిస్‌ను ప్రధాని మోడీ కలిసిన విషయం తెలిసిందే.ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు, కొవిడ్‌ మహమ్మారి వంటి పలు అంశాలపై వీరిద్దరూ చర్చించినట్లు సమాచారం.ఈ సందర్భంగా పోప్‌ను మోడీ భారత్‌కు ఆహ్వానించినట్లు తెలిపారు.అలాగే పోప్‌ ఫ్రాన్సిస్‌కు వెండితో ప్రత్యేకంగా తయారు చేసిన కొవ్వొత్తుల స్టాండ్‌ (క్యాండెలాబ్రా)ను ప్రధాని బహూకరించారు.దీనితోపాటు వాతావరణ మార్పుల విషయంలో భారత్‌ చర్యలపై రూపొందించిన ‘ది క్లైమెట్‌ క్లైంబ్‌’ పుస్తకాన్ని మోడీ పోప్‌కు అందజేశారు.

పోప్‌ సైతం ఓ కాంస్య ఫలకం, ప్రపంచ శాంతి, మానవ సౌభ్రాతృత్వం సందేశాలతో కూడిన పత్రాలను మోడీకి అందజేసినట్లు సమాచారం.

Telugu Summit, Indiancommunity, Italy, Modiindian, Pm Modi Italy, Pmnarendra-Tel

అంతకుముందు శుక్రవారం ఇటలీలో అడుగుపెట్టిన ప్రధాని మోడీకి భారత ఎన్‌ఆర్‌ఐలు ఘనస్వాగతం పలికారు.రోమ్‌లోని పియత్స గాంధీ ప్రాంగణం దగ్గర పెద్దసంఖ్యలో గుమిగూడిన అభిమానులు.మోడీకి అనుకూలంగా నినాదాలు చేశారు.

భారత త్రివర్ణ పతాకాలను పట్టుకుని స్వాగతం పలికారు.ఈ సందర్భంగా వారి దగ్గరగా వెళ్లి ఆత్మీయంగా పలకరించారు మోడీ.

ఇటలీ జీ-20 సమావేశం ముగిసిన తర్వాత… యూకే వెళ్లనున్నారు ప్రధాని.బ్రిటన్ ప్రధాని బోరిన్‌ జాన్సన్‌ ఆహ్వానం మేరకు నవంబరు 1న… గ్లాస్గోలో జరిగే కాప్‌ 26 సమావేశంలో ఆయన పాల్గొంటారు.

ఈ సందర్భంగా బోరిస్‌తోనూ ప్రధాని భేటీ కానున్నారు.అనంతరం విదేశీ పర్యటన ముగించుకుని నవంబరు 3న భారత్‌కు తిరిగి రానున్నారు నరేంద్ర మోడీ.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube