ప్రధాని నరేంద్ర మోడీ మూవీ ట్రైలర్ రిలీజ్! సోషల్ మీడియాలో ఆసక్తికర ట్రోల్స్  

ఆకట్టుకున్న పీఎం నరేంద్ర మోడీ బయోపిక్ ట్రైలర్. .

Pm Narendra Modi Movie Trailer Release-director Omung Kumar,movie Trailer Release,narendra Modi,pm,vivek Oberio

బీజేపీ పార్టీ లీడర్, ప్రస్తుత భారత ప్రధాని నరేంద్ర మోడీ జీవిత కథతో పీఎం నరేంద్ర మోడీ అనే సినిమా హిందీలో తెరకెక్కిన సంగతి అందరికి తెలిసిందే. వివేక్ ఒబరాయ్ టైటిల్ రోల్ పోషించిన ఈ సినిమాని ఓమంగ్ కుమార్ దర్శకత్వంలో తెరపైకి తీసుకొచ్చారు. ఇదిలా ఉంటే ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకున్న ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది..

ప్రధాని నరేంద్ర మోడీ మూవీ ట్రైలర్ రిలీజ్! సోషల్ మీడియాలో ఆసక్తికర ట్రోల్స్ -PM Narendra Modi Movie Trailer Release

ఏప్రిల్ 5న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాని రిలీజ్ చేయడానికి నిర్మాతలు రెడీ అయ్యారు. అయితే ఈ ట్రైలర్ అర్ధరాత్రి రిలీజ్ చేయడంపై సోషల్ మీడియాలో విపరీతంలో ట్రోలింగ్ జరుగుతుంది

ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఇందులో నరేంద్ర మోడీ చిన్నప్పుడు చాయ్ వాలాగా స్టార్ట్ చేసినప్పటి నుంచి కథ మొదలెట్టారు. అలాగే ఇందిరా గాంధీ ఎమర్జెన్సి టైంలో మారువేషాల్లో అతను ఎలా, ఎక్కడెక్కడ తిరిగాడు.

హిమాలయాలకి వెళ్లి సన్యాసిగా ఎందుకు మారాలని అనుకున్నాడు. గుజరాత్ అల్లర్ల సమయంలో ఎలా రియాక్ట్ అయ్యాడు. ప్రధానిగా పాకిస్తాన్ పై తన ఆలోచనలతో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు అనే విషయాలని టచ్ చేసి ఇంటిన్సిటీ పెంచే ప్రయత్నం చేసారు అని చెప్పాలి.

మరి ఈ సినిమా ప్రేక్షకులని ఎ మేరకు కనెక్ట్ చేస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.