నాటో దేశాలన్నీ కలిసి అతిపెద్ద దేశమైన ఇండియాను( India ) నాటో ప్లస్‌లో చేర్చాలని ప్రణాళికలు వేస్తున్నాయి.నాటో ప్లస్‌లో( NATO Plus ) చేరిన తర్వాత అందులో ఏ దేశం పైనైనా శత్రువులు దాడి చేస్తే అందులోని ప్రతి దేశం సహాయం చేయాల్సిందే.
మామూలుగా నాటోలో అయితే దేశాలు కలిసి పోరాడుతాయి కానీ నాటో ప్లస్ లోని దేశాలు సభ్య దేశాలకు సహాయం చేస్తే సరిపోతుంది.ఆయుధాలను సమకూర్చడం నుంచి రకరకాల సహాయక చర్యలు ఇందులో ఉంటాయి.
ఆస్ట్రేలియా, జర్మనీ ఆల్రెడీ నాటో ప్లస్ సంకీర్ణంలో చేరిపోయాయి.కాగా భారత్‌ను కూడా ఇందులో చేరమని ఆ దేశాలు కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే ఈ అభ్యర్థనలను భారత ప్రధాని నరేంద్ర మోదీ( PM Narendra Modi ) తీవ్రంగా తిరస్కరిస్తున్నట్లు టాక్ నడుస్తోంది.మరోవైపు రెండు రోజుల సదస్సులో నాటోకు సంబంధించిన లైజనింగ్ ఆఫీస్ (Liaison Office) జపాన్‌లో నిర్వహించాలని అమెరికా ప్లాన్ చేస్తోంది.ఈ ఆఫీస్ నాటో ప్లస్ లోని వేరువేరు దేశాలకు మధ్య కమ్యూనికేషన్ హబ్‌గా నిలుస్తుంది.అయితే ఇంత కీలకమైన ఆఫీసును అమెరికా జపాన్ లో ఏర్పాటు చేయడం ఫ్రాన్స్( France ) దేశానికి ఏమాత్రం నచ్చడం లేదని వార్తలు వస్తున్నాయి.
అయితే ఇక్కడ ఆఫీసును నెలకొల్పడానికి అమెరికాకు( America ) ఒక బలమైన కారణం ఉందని అంటున్నారు.తన అమ్ముల పొదిలో లేని ఆయుధాలను ఈ ఆఫీస్ ఏర్పాటు చేయడం ద్వారా పొందాలని అమెరికా భావిస్తోందట.మరోవైపు జపాన్( Japan ) తన వద్ద నుంచి ఆయుధాలను కొనాలని ఫ్రాన్స్ ఆశిస్తోంది.మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి.