కరోనాపై పోరులో నడిచేది.. నడిపించేది ప్రజలే: ఇండో- అమెరికన్ వైద్యులతో మోడీ వీడియో కాన్ఫరెన్స్  

Pm Modi Video Conference Aapi Members - Telugu Aapi Members, Corona Virus, Coronavirus: Pm Narendra Modi Video Conference With Aapi Members In Us, Indian American Doctors, Pm Modi

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న సమయంలో ముందుస్తుగా దాని వేగాన్ని అంచనా వేసిన ప్రధాని నరేంద్రమోడీ దేశంలో లాక్‌డౌన్ విధించారు.దీని వల్ల మనదేశంలో వైరస్ వ్యాప్తి నెమ్మదించింది.

 Pm Modi Video Conference Aapi Members

ఆ తర్వాత కూడా కోవిడ్ నివారణకు సంబంధించి అధికార, ప్రతిపక్షనేతల సలహాలు, సూచనలను పాటిస్తూ వచ్చారు మోడీ.ఈ నేపథ్యంలో శనివారం అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫీజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్ (ఏఏపీఐ) సభ్యులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.భారతదేశంలో కరోనాకు వ్యతిరేకంగా ప్రజలే పోరాటాన్ని నడిపిస్తున్నారని.ఇందులో ప్రాథమిక దశలో విజయం సాధించామంటే లాక్‌డౌన్ సమర్థవంతంగా అమలు కావడం వల్లేనని స్పష్టం చేశారు.దేశం స్వావలంబన దిశగా పనిచేయడానికి కరోనా ఒక అవకాశంగా ఉపయోగపడిందన్నారు.

కరోనాపై పోరులో నడిచేది.. నడిపించేది ప్రజలే: ఇండో- అమెరికన్ వైద్యులతో మోడీ వీడియో కాన్ఫరెన్స్-Telugu NRI-Telugu Tollywood Photo Image

ఇదే సమయంలో అమెరికాలో ఒక మిలియన్‌కు 350 మంది, బ్రిటన్, ఇటలీ, స్పెయిన్ తదితర దేశాల్లో మిలియన్‌కు 600 మంది వంతున మరణించారని ప్రధాని గుర్తుచేశారు.వీటితో పోలీస్తే.

భారతదేశంలో మరణాల రేటు 12 శాతం కన్నా తక్కువేనని మోడీ వెల్లడించారు.

దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ కరోనాపై పోరులో అద్భుతంగా పనిచేస్తోందని ప్రధాని ప్రశంసించారు.అధిక జనాభా, జనసాంద్రత ఉన్న మనదేశంలో సామాజిక సమూహం సాధారణ జీవితమని, మతపరమైన, రాజకీయపరమైన సమావేశాలు భారీ ఎత్తున నిత్యం జరుగుతుంటాయన్నారు.అయినప్పటికీ కోవిడ్ 19పై పోరులో విజయం సాధించామని, ఇదంతా ప్రజల సహకారంతోనే సాధ్యమైందని మోడీ ప్రశంసించారు.

తగిన సమయంలో లాక్‌డౌన్ విధించడం వల్ల ప్రజల ప్రాణాలను రక్షించుకోగలిగామని ప్రధాని తెలిపారు.మొదట్లో పీపీఈ కిట్లు, మాస్క్‌లను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చేదని.కానీ ఇప్పుడు స్వయం స్వావలంబన సాధించి ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నామన్నారు.ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న భారత సంతతి వైద్యులు ఈ మహమ్మారిపై పోరులో పాలుపంచుకున్నందుకు గర్వంగా ఉందని నరేంద్రమోడీ కితాబిచ్చారు.

ఈ అసోసియేషన్‌లో భారతీయ సంతతికి చెందిన 80,000 మంది డాక్టర్లు సభ్యులుగా ఉన్నారు.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Pm Modi Video Conference Aapi Members Related Telugu News,Photos/Pics,Images..

footer-test