పంచ సూత్రాల అమలు వ్యూహంతోనే వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చు అంటున్న ప్రధాని..!

ఇప్పటికే దేశంలో కరోనా వైరస్ విజృంభణ తీవ్రత కొనసాగుతుంది.దీంతో అలెర్ట్ అయిన కేంద్ర ప్రభుత్వం వెంటనే వైరస్ ఉదృతి ఎక్కువగా ఉన్న  రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను పంపించాలని ఆదేశాలు జారీ చేసింది.

 Pm Modi, Vaccination , Covid Vaccine, Carona Accine, Special Team, Special Anti-TeluguStop.com

ఈ క్రమంలో కరోనా కట్టడిపై అత్యున్నత సమావేశం నిర్వహించిన ప్రధాని మోడీ  అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేయడంతో పాటు పలు సూచనలు ఇచ్చారు.ఈ సమావేశంలో భాగంగా కరోనా వాక్సిన్ పంపిణీ పై ఆరా తీయడంతో పాటు, అన్ని రాష్ట్రాల జిల్లాలలో వాక్సిన్ పంపిణీ కార్యక్రమం ఎలా  నిర్వహిస్తున్నారని, ఇప్పటివరకు ఎంతమంది ప్రజలు వాక్సినేషన్ వేయించుకున్నారు అన్న విషయంపై ప్రధాని మోడీ చర్చలు నిర్వహించారు.

కరోనా కట్టడిలో భాగంగా ఏప్రిల్ 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు కరోనా వైరస్ పై పలు జాగ్రత్తలు, మాస్క్  వినియోగంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వలకు ప్రధాన మోడీ ఆదేశాలు జారీ చేశారు.ఇక దేశంలో కరోనా వైరస్ విజృంభణ అధికంగా ఉండడం వల్ల పంచ సూత్రాల అమలు వ్యూహంతోనే వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చని  ప్రధాన మోడీ తెలిపారు.

ప్రజలందరూ కూడా కరోనా జాగ్రత్తలు పాటించే విధంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, అలాగే అధికారులు కూడా వాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగం చేయాలని మోడీ తెలిపారు.ముఖ్యంగా కరోనా వైరస్ ఉధృతి ఎక్కువగా ఉన్న ఆరు రాష్ట్రాలకు వెంటనే ప్రత్యేక బృందాలను పంపేయాలని ఆదేశాలు జారీ చేశాడు.

ఈ క్రమంలో ఉధృతి అతి ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో మహారాష్ట్ర, పంజాబ్‌, ఛత్తీస్‌గఢ్‌  రాష్ట్రాలకు అత్యవసరంగా ప్రత్యేక వైద్య బృందాలను పంపించి.వైరస్ ను తగ్గించేందుకు టెస్టింగ్‌, ట్రేసింగ్‌, ట్రీట్‌మెంట్‌, కొవిడ్‌ నిబంధనలు పాటించడం, వ్యాక్సినేషన్‌ వేగం పెంచడం లాంటి పంచ సూత్రాల వ్యూహాన్ని అమలు పరచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు నరేంద్ర మోడీ.

ఈ పంచ సూత్రాలను పాటించడంవల్ల కరోనా ఉధృతి అదుపులోకి తీసుకొని రావచ్చని అభిప్రాయపడ్డారు మోడీ.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube