స్వచ్ఛభారత్‌కు సత్కారం: మోడీకి బిల్‌గేట్స్ ఫౌండేషన్ అవార్డ్

ప్రధాని నరేంద్రమోడిని ప్రతిష్టాత్మక ‘‘గ్లోబల్ గోల్ కీపర్’’ అవార్డుకు ఎంపికయ్యారు.దేశంలో పారిశుద్ధ్యాన్ని పెంపోందించే లక్ష్యంతో మోడీ ప్రవేశపెట్టిన స్వచ్ఛభారత్‌ కార్యక్రమానికి గాను ఆయనను ఈ అవార్డు వరించింది.

 Pm Modi To Get Award From Bill And Melinda Gates Foundation Swachh Bharat-TeluguStop.com

మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ సారథ్యంలోని బెల్ అండ్ మెలిండా ఫౌండేషన్ ఈ అవార్డును అందజేస్తుంది.ఈ నెల 24న బ్లూమ్‌బర్గ్ గ్లోబల్ బిజినెస్ ఫోరమ్ వేదికగా జరగనున్న కార్యక్రమంలో ప్రధానికి ఈ అవార్డును బహుకరించనున్నారు.

మహాత్మాగాంధీ 150వ జన్మదినోత్సవం నాటికి బహిరంగ మలమూత్ర విసర్జన రహిత దేశంగా భారత్‌ను చేయాలన్న లక్ష్యంతో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తొలి నాళ్లలో మోడీ స్వచ్ఛభారత్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే తొమ్మిది కోట్ల మరుగుదొడ్లను నిర్మించగా.

భారత్‌లో 98 శాతం గ్రామాలు బహిరంగ మలమూత్ర రహితమయ్యాయి.

Telugu Melinda Gates, Swachhbharat-Telugu NRI

ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గోనేందుకు ప్రధాని త్వరలో అమెరికా వెళ్లనున్నారు.2014 ఎన్నికల్లో అధికారాన్ని అందుకున్న తర్వాత మోడీ తొలిసారి ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించగా.రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక.

ఆయనకు మరోసారి ఈ అవకాశం వరించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube