మోడీ ఊహించని పర్యటన,అసలు ఏమి జరుగబోతోంది!  

PM Modi surprise visit to Ladakh, PM Modi,ladakh, china India Botrder, Modi visit Indian army - Telugu China India Botrder, Ladakh, Modi Visit Indian Army, Pm Modi, Pm Modi Surprise Visit To Ladakh

ఇటీవల భారత సరిహద్దుల్లో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయో అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.సరిగ్గా ఇలాంటి సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ ఊహించని పర్యటనకు శ్రీకారం చుట్టడం గమనార్హం.

 Pm Modi Surprise Visit Ladakh Indian Army

ఎలాంటి సమాచారం, ముందస్తు ప్రణాళిక లేకుండానే లడఖ్‌లో పర్యటించడానికి శ్రీకారం చుట్టారు.శుక్రవారం ఉదయం నేరుగా సరిహద్దు ప్రాంతానికి వెళ్లి అక్కడ సైనికులతో సమావేశం నిర్వహించారు.

ఇటీవల చైనాతో వీరోచితంగా పోరాడి.నిత్యం గస్తీ కాస్తున్న జవానుల్లో ధైర్యం నింపేందుకు ఈ ఆకస్మిక పర్యటన చేపట్టినట్లు తెలుస్తుంది.అత్యంత రహస్యంగానే ఆయన పర్యటనకు ఏర్పాట్లు జరిగినట్లు సమాచారం.ఈ పర్యటనలో ప్రధాని మోడీ తో పాటు వెంట త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ కూడా ఉన్నారు.

మోడీ ఊహించని పర్యటన,అసలు ఏమి జరుగబోతోంది-General-Telugu-Telugu Tollywood Photo Image

దురాక్రమలకు పాల్పడిన వారిని ఏ మాత్రం ఉపేక్షించవద్దని ఈ సందర్భంగా ప్రధాని సూచనలు చేసినట్లు తెలుస్తుంది.లడఖ్, లేహ్ పర్యటిస్తూ.

సోషల్ మీడియాలో వీడియోలు, ఫొటోలను పోస్టు చేయడం తో ఈ విషయం బయట పడింది.ఈ సందర్భంగా ఆర్మీ దుస్తువులు ధరించి సైనికులతో కొంతసేపు ఆయన ముచ్చటించినట్లు తెలుస్తుంది.

అంతేకాకుండా విధుల్లో ఉన్న జవానులకు సెల్యూట్ చేసి, వారి భుజాలు తడుతూ అభినందించడమే కాకుండా ఆ సమయంలో జై జవాన్, భారత్ మాతాకీ జై అనే నినాదాలతో సరిహద్దులు దద్దరిల్లిపోయాయి.

కరోనా ఆంక్షలను కూడా పక్కనపెట్టి అతి సమీపంగా సైనికులను తాకుతూ.

షేక్ హ్యాండ్స్ కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది.ఇప్పటికే చైనా, పాక్ చర్యలతో భారత్ ఉక్కిరి బిక్కిరి అవుతున్న క్రమంలో చైనా కు సంబందించిన 59 యాప్ లను నిషేదించిన విషయం తెలిసిందే.

అయితే వాస్తవానికి రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అక్కడికి వెళ్లాల్సి ఉండడం తో అన్ని ఏర్పాట్లు కూడా జరిగాయి.అయితే చివరి నిమిషంలో ప్రధాని మోడీ అక్కడికి వెళ్లడం విశేషం.

#PM Modi #Ladakh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Pm Modi Surprise Visit Ladakh Indian Army Related Telugu News,Photos/Pics,Images..