మోడీ నోట..బాబు సన్ రైజ్..అడ్డంగా దొరికేశారుగా..బాబు     2019-01-08   09:50:20  IST  Surya Krishna

ఏపీలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు ప్రజలకి మాత్రం వీనుల విందుగా, వినసొంపుగా ఉన్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయం కావడం, అందులోనూ సంక్రాంతి సమయం కావడంతో టీవీలలో ఎంటర్టైన్మెంట్స్ కార్యక్రమాల మాట ఏమో కానీ రాజకీయ నేతల మాటల నుంచీ వచ్చే ఎంటర్టైన్మెంట్ మాత్రం పీక్ స్టేజ్ కి వెళ్ళిపోతోంది. ముఖ్యంగా రాజకీయ నేతలు చేసుకునే వాదోపవాదాలు, మీడియా ముందు తిట్టుకునే తిట్లు, ఓ పార్టీ నాయకుడు ఒక మాట మాట్లాడితే దానికి నానార్ధాలు, ప్రతిపదార్ధాలు తీసే తలపండిన నేతలు అబ్బో..ఎన్నో ఎన్నో కార్యక్రమాలు ముందు ముందు ప్రజలని అలరించనున్నాయి.

అయితే ఈ కార్యక్రమాలని ముందుగా ఓం ప్రదంగా మొదలు పెట్టారు ప్రధాని మోడీ జీ..రిబ్బన్ కట్టింగ్ కూడా చేసేశారు..2014 లో చెట్టాపట్టాలు వేసుకుని, స్నేహం మంటనే మనదేరోయ్ అనేట్టుగా సాగిన మోడీ , బెజేపీ , పవన్ ల దోస్తీ పటాపంచలు అయ్యింది. ఎవరి వ్యుహాలు వారివిలెండి. అయితే ఏపీలో ఎట్టిపరిస్థితుల్లోనూ చంద్రబాబు ని అధికారంలోకి రానివ్వకూడదని పట్టుగా ఉన్న బీజేపీ బాబు ప్రతీ ప్రయత్నాన్ని వ్యంగ్యంగా చిత్రీకరిస్తోంది.అందుకు ఆద్యం పోసింది. మాత్రం మోడీ నే..

Pm Modi Said Chandrababu Focus On Son Rise Can Lead To Sunset In Ap-Focus Pm Ap

Pm Modi Said Chandrababu Focus On Son Rise Can Lead To Sunset In Ap

తాజాగా మోడీ జీ బాబు పై చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి గత కొంత కాలంగా మోడీ బాబు పై విమర్శలు సంధిస్తూనే ఉన్నారు కదా ఇందులో స్పెషల్ ఏముందు అనుకోకండి స్పెషల్ ఉంది. అదేంటంటే..సీఎం చంద్రబాబు మాట్లాడే “సన్‌రైజ్ ఏపీ” అనే పదాన్ని ఆయన వ్యంగ్యాస్త్రంగా తీసుకుని బాబును ఇరకాటంలోకి తోశారు..ఇప్పుడు అదే అన్ని పార్టీలకి వరంగా మారింది. సన్ : అంటే సూర్యుడని చంద్రబాబు ఉపమానం. అయితే, మోడీ దీనికి రివర్స్ గా “సన్‌- అంటే బాబు సుపుత్రుడు లోకేష్ అనే అర్థం మార్చి విమర్శలు చేశారు..

Pm Modi Said Chandrababu Focus On Son Rise Can Lead To Sunset In Ap-Focus Pm Ap

“సన్ రైజ్ ఏపీ” అంటే..కొడుకు భవిష్యత్ కోసం సీఎం చంద్రబాబు అలుపులేకుండా కష్టపడుతున్నారని, రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం కాదని, ఏపీ ప్రజలు ఈ విషయం గుర్తు పెట్టుకోవాలని షాకింగ్ కామెంట్స్ చేశారు. దాంతో ఇప్పుడు మోడీ వ్యాఖ్యలు ఏపీలో వైరల్ అవుతున్నాయి. అసలే తెలంగాణా దెబ్బకి చుక్కలు లెక్కలు పెడుతున్న బాబుకి ఇప్పుడు తాజా గా మోడీ చేసిన వ్యాఖ్యలు ఒకింత ఇబ్బంది పెట్టినట్టే. ఇప్పుడు ఈ రకమైన వ్యాఖ్యలనే జనసేన నేతలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ టీడీపీ కి ఘలక్ ఇస్తున్నారు. మోడీ నా మజాకా నా అంటూ బీజేపీ నేతలు తెగ సంబర పడిపోతున్నారు.