మోడీకి రాఖీ పంపించిన పాకిస్థాన్ మహిళ

భారత్, పాకిస్తాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంతుంది.మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాకిస్తాన్ మీద అన్ని రకాలుగా ఆంక్షలు విధించడంతో పాటు, పాకిస్తాన్ ని ఇంతకాలంగా పెద్ద అండగా ఉన్న కాశ్మీర్ ఇష్యూని పరిష్కరించి.

 Pm Modi's Pakistani Sister Sends Him Rakhi, Pm Modi, Pakistan, Rakhi Festival-TeluguStop.com

ఆ రాష్ట్రానికి ఉన్న స్వయం ప్రతిపత్తిని రద్దు చేశారు.దీని తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వానికి మోడీ సర్కార్ మీద, ఇండియా మీద మరింత కోపం పెరిగిపోయింది.

అందుకే ఆ దేశంలో ఉగ్రవాదులని రెచ్చగొట్టి ఇండియాపైకి పంపిస్తున్నారు.అయితే అలా వచ్చిన ఉగ్రవాదులు దేశంలోకి చొరబడకుండా సరిహద్దులోనే వారికి చెమటలు పట్టిస్తున్నారు.

ఇండియా మీద ఆధిపత్యం చెలాయించే అవకాశం పాకిస్తాన్ కి దొరకకపోవడంతో అంతర్గతంగా ఉడికిపోతుంది.అయితే అలాంటి శత్రు దేశంకి చెందిన మహిళ ప్రధాని నరేంద్ర మోడీకి ప్రతి ఏడాది రాఖీ కడుతుంది.

కమర్ మొహిసిన్ షేక్ అనే పాకిస్తాన్ కి చెందిన మహిళా ఇండియాకి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో అహ్మదాబాద్ లో ఉంటుంది.ఈమె మోడీకి గత 25 ఏళ్ల నుంచి రాఖీ కడుతుంది.

ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలియజేసింది.అప్పుడు మోడీ ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త అని తెలిపారు.

తన పట్టుదల, శ్రమతో ప్రధాన మంత్రి వరకు ఎదిగారని ప్రశంసించారు.మోడీని తనతో పాటు తన భర్త మొహిసిన్‌, కుమారుడు సుఫీయాన్‌ కూడా అభిమానిస్తారని తెలిపారు.

మోడీ నుంచి పిలుపు వస్తే తాను తప్పకుండా ఢిల్లీ వెళ్తానని కమర్‌ చెప్పారు.చాలా సార్లు మోడీ కమర్‌కు ఫోన్‌ చేసి రాఖీ కట్టించుకోవడానికి పిలిచారు.

కమర్‌ భర్త, కొడుకు గురించి అడిగి తెలుసుకునే వారు.మోడీ చాలా సాధారణంగా కనిపించిన పనులు మాత్రం గొప్పగా చేస్తారన్నారు కమర్‌.

తన ఇద్దరు చెల్లెళ్లు కూడా మోడీకి రాఖీ కట్టాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.పాకిస్తాన్ దేశానికి చెందిన కమర్‌ మొహిసిన్‌ భారత్‌కు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో ఎన్నో ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నారు.

ప్రస్తుతం వారు అహ్మదాబాద్‌లో ఉంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube