మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ..!!

దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత అంతకంతకూ పెరిగి పోతుండటంతో కరోనా బారిన పడిన రోగులు అనేక అవస్థలు పడుతున్నారు.ప్రభుత్వాలు కూడా ఏం చేయలేని పరిస్థితి నెలకొంటుంది.

 Pm Modi Led Virtual Video Conference With Cabinet Ministers On Corona Lock Down,-TeluguStop.com

పరిస్థితి ఇలా ఉండగా మరోపక్క ఇండియాలో లాక్ డౌన్ విధించాలి అని అంతర్జాతీయ నిపుణుల నుండి ఒత్తిడి వస్తూ ఉంది.ఇప్పటికే దేశంలో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడం జరిగింది.

పరిస్థితి ఇలా ఉండగా ప్రధాని మోడీ వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్నారు.

దేశంలో మళ్లీ లాక్ డౌన్ అమలు చేస్తే ఎలా ఉంటుంది.? ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి వంటి విషయాలపై చర్చించనున్నట్లు సమాచారం.ఈ సమావేశంలో కేంద్ర మంత్రులతో పాటు వివిధ శాఖల ఉన్నత అధికారులు కూడా పాల్గొంటున్నారు.

అదేవిధంగా హాస్పిటల్ లో పడకాలు మరియు ఆక్సిజన్ సరఫరా.వ్యాక్సినేషన్ పై కూడా చర్చించ బోతున్నారు.

ఈ సమావేశంలో మంత్రులు మరియు ఉన్నత అధికారుల అభిప్రాయాలను మోడీ తెలుసుకొని దేశంలో లాక్ డౌన్ ఉంటుందా లేదా అనే దానిపై ప్రకటన చేయనున్నట్లు సమాచారం. 

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube