ఐదేళ్లలో మోదీ విదేశీ పర్యటనల ఖర్చు ఎంతో తెలుసా..?

సాధారణంగా ఏ దేశానికైనా ప్రధానిగా ఉండేవాళ్లు విదేశాంగ శాఖ సూచనల మేరకు విదేశాలకు పర్యటనలు చేయాల్సి ఉంటుంది.అలా ప్రధాని నరేంద్ర మోదీ కూడా గత ఐదేళ్లలో 58 దేశాలలో పర్యటించారు.కేంద్రం పార్లమెంట్‌లో ప్రధాని పర్యటనల వ్యయానికి సంబంధించిన వివరాలను వెల్లడించింది.2015 సంవత్సరం నుంచి ప్రధాని పర్యటనల కొరకు రూ.517.82 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు పేర్కొంది.

 Pm Modi Has Visited 58 Nations Since 2015 At Cost Of 517 Crore Centre, Pm Narend-TeluguStop.com

పార్లమెంట్ లో విపక్ష సభ్యుల కోరిక మేరకు లిఖితపూర్వకంగా కేంద్రం ఈ విషయాలను ప్రకటించింది.కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్ పర్యటనలు, ఖర్చులకు సంబంధించిన పూర్తి వివరాలను పార్లమెంట్ ముందు ఉంచారు.

అమెరికా, రష్యా, చైనాలకు మోదీ అత్యధికంగా ఐదుసార్లు పర్యటించారని.ఈ దేశాలతో పాటు ప్రధాని సందర్శించిన దేశాల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఫ్రాన్స్, సింగపూర్, జర్మనీ, శ్రీలంక దేశాలు ఉన్నాయని చెప్పారు.

గతేడాది నవంబర్ నెలలో మోదీ బ్రెజిల్ లో చివరిసారిగా పర్యటించారని మురళీధరన్ వెల్లడించారు.కరోనా, లాక్ డౌన్ వల్ల మోదీ ఈ సంవత్సరం విదేశీ పర్యటనలు చేయలేదని పేర్కొన్నారు.

మోదీ విదేశీ పర్యటనల వల్ల ఆర్థిక, సాంకేతిక, వాణిజ్య సంబంధాలు మెరుగుపడ్డాయని తెలిపారు.మోదీ విదేశీ పర్యటనల గురించి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ఉంటారు

2019 ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ మోదీ విదేశీ పర్యటనల గురించి మాట్లాడుతూ దేశంలో సంక్షోభం ఉన్న వ్యవసాయ రంగాన్ని పట్టించుకోకుండా మోదీ విదేశీ పర్యటనలకు ప్రాధాన్యత ఇస్తున్నాడని విమర్శించారు.

అయితే మోదీ పర్యటనల వల్ల ద్వైపాక్షిక సంబంధాలు ధృడమయ్యాయని.సాంకేతిక, వాణిజ్య, రక్షణ రంగాల్లో ఇతర దేశాల సహాయం పెరిగిందని బీజేపీ నేతలు చెబుతున్నారు.

ప్రపంచ స్థాయిలో సైబర్‌ సెక్యూరిటీ, ఉగ్రవాదం, వాతావరణ మార్పులు, ఇతర అంశాలపై ఎజెండా రూపకల్పనలో భారత సహకారం ఎక్కువగా ఉందని బీజేపీ నేతలు అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube