లోకల్-వోకల్ తో చైనా మార్కెట్ కి గండికొట్టిన మోడీ

దేశీయ ఉత్పత్తి రంగాన్ని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ప్రధాని నరేంద్ర మోడీ మేక్ ఇన్ ఇండియా విజన్ లో మరో ముందడుగు వేయడానికి సిద్ధమయ్యారు.దేశీ ప్రోడక్ట్ కి ప్రాధాన్యత పెంచే విధంగా లోకల్-వోకల్ ప్రచారాన్ని తెరపైకి తీసుకొచ్చారు.

 Every Indian Must Become Vocal For Our Local, Pm Modi, Lock Down, Make In India,-TeluguStop.com

మన దేశంలో చైనా వస్తువుల ఆధిపత్యం ఎక్కువగా ఉంది.అక్కడ ప్రోడక్ట్ ఉత్పత్తులు చేసి భారత్ లోకి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకొని సొమ్ముచేసుకుంటూ దానిని ఆధిపత్యం కోసం ఉపయోగించుకుంటుంది.

అలాగే భారత్ ని నియంత్రించేందుకు పాకిస్తాన్ లాంటి దేశాలకి ఇస్తుంది.ఇక చైనా ఉత్పత్తి మార్కెట్, దేశంలో వారి ఉత్పత్తుల ఆధిపత్యం తగ్గించే దిశగా ప్రధాని మోడీ కీలక ప్రకటన చేశారు.

ఇకపై వీలైనంత వరకు ప్రతి ఒక్కరు దేశీయ ఉత్పత్తులని కొనుగోలు చేయడంతో వాటిని అందరూ కొనే విధంగా ప్రచారం చేయాలని తద్వారా దేశీయ ఉత్పత్తి రంగానికి అండగా నిలబడి మనకి కావాల్సిన వస్తువులని మనమే ఉత్పత్తి చేసుకునే స్థాయికి పెరగాలని, అలాగే భారత్ ఉత్పత్తులకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు.నిజానికి మోడీ ఒక మాట చెబితే ఇండియాలో మెజారిటీ ప్రజలు కచ్చితంగా ఫాలో అవుతారు.

ఇప్పుడు మేక్ ఇండియా విజన్ తో భాగంగా లోకల్-వోకల్ అంటూ ఇచ్చిన పిలుపు కచ్చితంగా గణనీయమైన ప్రభావం చూపించాబోతుందని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు.ఇక చైనా ఉత్పత్తులకి, దేశంలో వారి మార్కెట్ ఆధిపత్యానికి గండి పడే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు.

ఇదే సమయంలో ఉత్పత్తి రంగానికి బాసటగా నిలిచి గణనీయమైన దేశీయ ఉత్పత్తులని మార్కెట్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం ప్రభుత్వం ఉన్నపళంగా మొదలుపెట్టాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube