ఆదివారం జనతా కర్ఫ్యూ పాటించండి... ప్రధాని మోడీ పిలుపు

కరోనా భయం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉంది.అన్ని దేశాలకి మెల్లగా వ్యాపిస్తున్న ఈ కరోనా భారిన ఇప్పటికే లక్షలాది మంది ప్రజలు పడ్డారు.

 Pm Modi Calls For Janata Curfew On March 22-TeluguStop.com

అయితే ఇవన్ని అధికారికంగా గుర్తించినవి అయితే గుర్తించని కేసులు ఇంకెన్ని ఉన్నాయో చెప్పలేని పరిస్థితి.ఇక ఇప్పుడు ఇండియాలోకి కూడా ఈ కరోనా ఎంటర్ అయిపొయింది.

ఇప్పటి వరకు అధికారికంగా కరోనా పోజిటివ్ కేసులు దేశంలో రెండు వందల లోపే ఉన్నాయి.అయితే విదేశాల నుంచి దేశంలో ప్రవేశించి బయట తిరుగుతున్నా వారు పదివేల మంది వరకు ఉన్నారని వారిలో ఎంత మందికి కరోనా పోజిటివ్ ఉందో తెలియడం లేదని అధికారులు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే కరోనా వైరస్ చాపక్రింద నీరులో దేశంలో విస్తరిస్తూ ఉంది.ఈ నేపధ్యంలో ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి మాట్లాడారు.

మానవజాతిని కరోనా వైరస్ సంక్షోభంలోకి నెట్టిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.కరోనాతో ప్రపంచం మొత్తం గందరగోళంలో ఉందని, మొదటి ప్రపంచ యుద్ధం నాటి పరిస్థితులు తలెత్తాయని అన్నారు.

కరోనాపై మనమంతా ఉమ్మడిగా పోరాడాలని, ఇందుకు దేశ ప్రజలు సహకరించాలని కోరారు.కరోనా నివారణ కోసం ఈ నెల 22న ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూ పాటించాలని పౌరులందరినీ కోరుతున్నానని అన్నారు.

ఆ రోజున ఉదయం ఏడు నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఎవరూ బయటకు రాకుండా ఇళ్లకే పరిమితం అయ్యి కర్ఫ్యూ పాటిద్దామని, ఇది ప్రజల కోసం ప్రజల ద్వారా ప్రజలే చేసుకునే కర్ఫ్యూగా ఆయన అభివర్ణించారు.కరోనాపై మనం చేస్తున్న అతి పెద్ద యుద్ధం ఇదే అని ఆయన తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube