హత్రాస్ ఘటనపై యోగి కి ఫోన్ చేసిన మోడీ!

2012 లో దేశరాజధాని ఢిల్లీ లో చోటుచేసుకున్న నిర్భయ ఘటన ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే.ఇటీవల యూపీ లోని హత్రాస్ లో చోటుచేసుకున్నదారుణ ఘటన మానవులను కదిలించేస్తుంది.

 Modi Telephoned Up Cm Yogi On Hathras Incident, Hathras Incident, Hathras Gang-r-TeluguStop.com

యూపీలోని హత్రాస్ లో ఓ యువతిని నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసి అత్యంత దారుణంగా హింసిస్తూ, సామూహిక అత్యాచారం చేసి మానవ మృగాలుగా నిలిచారు.తల్లి తో పాటు పని కోసం వెళ్లిన 19 ఏళ్ల యువతిని కిడ్నాప్ చేసి ఆమె పై నలుగురు మృగాలు పాశవికంగా అత్యాచారం చేసి అనంతరం ఆమె నాలుకను కోసేసి చిత్ర హింసలకు గురి చేసారు.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆ యువతి పరిస్థితి విషమంగా ఉండడం తో ఢిల్లీ లోని సఫ్దర్ జంగ్ ఆసుపత్రికి తరలించారు.

అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ యువతి పరిస్థితి విషమించడం తో గతరాత్రి ఆమె మృతి చెందింది.

మరోవైపు ఆమె శరీరంలోని పలు ఎముకలు విరిగిపోయాయి.శరీరంలోని పలు అవయవాలు పని చేయని స్థితిలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.

ఈ ఘటన దేశ వ్యాప్తంగా ఆగ్రహజ్వాలలను రగిల్చింది.ఈ ఘటనకు భాద్యులు అయిన వారిని కఠినంగా శిక్షించాలి అంటూ దేశవ్యాప్తంగా పలువురు డిమాండ్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోయూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేసినట్లు తెలుస్తుంది.ఈ ఘటనకు బాధ్యులైనవారిని కఠినంగా శిక్షించాలని యోగిని ఆదేశించినట్లు సమాచారం.

మోడీ ఫోన్ చేసిన విషయాన్ని యూపీ సీఎం యోగి వెల్లడించారు.అయితే ఈ కేసు విషయంలో ముగ్గురు అధికారులతో ఒ ప్యానెల్ కూడా ఏర్పాటు చేశామని వారం రోజుల్లో ఈ ప్యానెల్ రిపోర్టు సమర్పిస్తుందని సీఎం తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube