వీళ్ళపై చర్యలు తీసుకోండి ప్లీజ్.. వేదిస్తున్నారంటూ సమంత పర్సనల్ డిజైనర్ ఆవేదన

మామూలుగా సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలు తమ పెళ్లి జీవితంలో తమకు నచ్చినట్లుగా నిర్ణయాలు తీసుకుంటారు.అందులో సందేహమేమీ లేదు.

 Please Take Action Against Them Samantha Personal Designer Preetham Jukalker Det-TeluguStop.com

ఇప్పటికే ఎంతో మంది జంటలు విడిపోయి మళ్లీ పెళ్లి చేసుకున్నా కూడా ఎవరు పట్టించుకోలేదు.కానీ తాజాగా సమంత, నాగ చైతన్య విడాకులు తీసుకుంటున్నారని తెలియడంతో అభిమానులంతా షాక్ లో ఉన్నారు.

ఇప్పటికీ కూడా అభిమానులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యూట్ కపుల్ గా నిలిచిన ఈ జంట ఎంతోమందికి ఆదర్శంగా ఉన్నారని తెలుగు ప్రేక్షకులందరూ అనుకున్నారు.

ఏం మాయ చేసావే సినిమాతో ఇద్దరు పరిచయాన్ని పెంచుకొని ప్రేమగా మార్చుకున్నారు.ఆ తర్వాత తమ విషయాన్ని ఇంట్లో చెప్పి కుటుంబ సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.పెళ్లి తరువాత కూడా ఈ జంట కలిసి సినిమాలలో, వాణిజ్య ప్రకటనలలో నటించారు.

పెళ్లి తర్వాత ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉంది.

అక్కినేని కుటుంబంతో సమంత బాగా దగ్గరయింది.పైగా అక్కినేని వారి కోడలు కావడంతో సమంతాకు మరింత హోదా అందింది.

అలా వీరి జీవితం సాగుతున్న తరుణంలో ఏం జరిగిందో తెలియదు కానీ మధ్యలో పెద్ద సునామీలా వచ్చి పడింది విడాకులు అనే పదం.గత కొన్ని రోజుల నుండి సమంత అక్కినేని కుటుంబంకు దూరంగా ఉంటుందని బాగా వార్తలు వినిపించాయి.

Telugu Akkineni, Personal, Samantha, Samanthanaga, Tollywood-Movie

ఇవన్నీ పుకార్లు అని అందరూ అనుకున్నారు కానీ రెండు రోజుల కిందట సమంత, నాగ చైతన్య తాము విడిపోతున్నాము అని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.ఇక ఈ విషయం తెలియగానే అక్కినేని ఫ్యామిలీతో సహా అభిమానులంతా షాక్ లో ఉన్నారు.ఇంత సడన్ గా వీరికి ఏమైంది అంటూ వీరు విడాకులు తీసుకోవడానికి ఎవరు కారణం అంటూ బాగా చర్చలు చేస్తున్నారు.

Telugu Akkineni, Personal, Samantha, Samanthanaga, Tollywood-Movie

కొందరు వీరి విడాకులకు కారణం సమంత పర్సనల్ డిజైనర్ ప్రీతమ్ జుకాల్కర్ అని కొందరు విమర్శలు చేస్తున్నారు.పైగా అతడిని సోషల్ మీడియాలో ట్యాగ్ చేసి దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.ఇక తాజాగా ప్రీతమ్ స్పందిస్తూ తను సోషల్ మీడియా వేదికగా ఓ విషయాన్ని పంచుకున్నాడు.

దీపు అనే ఒక లో లైఫ్ మనిషి తనను ఎంతో వేధిస్తున్నాడు అంటూ.తన ఇన్ స్టాగ్రామ్ రిపోర్ట్ చేయండి అని, వీళ్ళ పై చర్యలు తీసుకోండి అని తన ఫాలోవర్స్ ని కోరుకుంటున్నాడు.

ఈయనకు పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో తన కామెంట్ సెక్షన్ ను కూడా డిసేబుల్ లో పెట్టాడు.

Telugu Akkineni, Personal, Samantha, Samanthanaga, Tollywood-Movie

మరికొందరు సమంతదే తప్పు అంటూ మంచి కుటుంబాన్ని చేతులారా వదులుకుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.ఇక సమంత, నాగచైతన్య విడిపోవడానికి అసలు కారణాలు ఏంటో తెలియక అభిమానులంతా బాగా తలపట్టుకుంటున్నారు.ఇక కొందరు వారిద్దరిని ఎవరో దూరం చేయాలని ప్లాన్ చేశారు అంటూ లేదంటే వాళ్ళు మంచి కపుల్స్ అంటూ విడిపోయే ఛాన్స్ లేదు అంటూ బాగా చర్చలు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube