కేటీఆర్ సాయం కోరిన యాంకర్ రష్మీ.. ఏం జరిగిందంటే?

బుల్లితెరపై అద్భుతమైన మాట వాక్చాతుర్యంతో ఎంతోమందిని ఆకట్టుకున్న యాంకర్ రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే రష్మీ సామాజిక అంశాలపై కూడా స్పందిస్తూ ఉంటారు.

 Please Soemthing Needs To Be Done Rashmi Asks Ktr-TeluguStop.com

కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న ఈ యాంకర్ జంతు ప్రేమికురాలు అనే విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే గత లాక్ డౌన్ సమయంలో ఎన్నో మూగజీవాలకు తరచూ ఆహారాన్ని అందిస్తూ వాటిపై ఉన్న ప్రేమను చాటుకున్నారు.

తాజాగా మరోసారి మూగ జీవాలపై తన అభిమానాన్ని చాటుకుంది.నోరులేని మూగజీవాలను ఏదైనా ప్రమాదం వాటిల్లితే స్పందించడానికి రష్మీ ముందువరుసలో ఉంటారు.ఈ క్రమంలోనే తెలంగాణ మంత్రి కేటీఆర్ గారిని జంతువుల కోసమే ఒక సహాయం అడిగారు.జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్నటువంటి శునకాలకు యానిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేసి వాటిని అదేవిధంగా రోడ్లపైకి వదిలేస్తున్నారని.

 Please Soemthing Needs To Be Done Rashmi Asks Ktr-కేటీఆర్ సాయం కోరిన యాంకర్ రష్మీ.. ఏం జరిగిందంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆపరేషన్ చేసిన తర్వాత వాటికి సరైన చికిత్సను అధికారులు అందించలేదు.ఈ క్రమంలోనే ఈ సమస్యకు సరైన పరిష్కార చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆమె మంత్రి కేటీఆర్ ని కోరారు.

ఈ విషయం గురించి రష్మి ట్విట్టర్ ద్వారా కేటీఆర్‌ కార్యాలయ ఖాతాతో పాటు కేటీఆర్‌ వ్యక్తిగత ట్విటర్‌ ఖాతాను ట్యాగ్‌ చేస్తూ ట్వీట్ చేశారు.ఈ విధంగా బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేసిన కుక్కలను రోడ్లపైకి వదిలివేయడంతో ఆ కుక్కల ఫొటోలను వివరాలతో సహాసేవ్‌యానిమల్స్‌ఇండియాఅనే ట్విటర్‌ గత కొంతకాలం నుంచి ట్వీట్ చేస్తూనే ఉన్నారు.ఇప్పటివరకు జిహెచ్ఎంసి పరిధిలో సుమారుగా 2,122 శునకాలకు ఆపరేషన్ చేసి రోడ్లపై వదిలేసినట్టు తెలిపారు.ఈ క్రమంలోనే వీటికి సరైన చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలంటూ యాంకర్ రష్మీ మంత్రి కేటీఆర్ కి విజ్ఞప్తి చేశారు.

మరి రష్మీ కోరిన ఈ సహాయానికి మంత్రిగారు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

#Trat Animals #Rashmi #Animal Lover #Fondness Dumb #Animal

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు